రుణమాఫీ తీసుకోలేదు – రితేశ్ దేశ్ ముఖ్ 

  • Publish Date - December 5, 2019 / 04:35 AM IST

బాలీవుడ్ హీరో, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేశ్ దేశ్ ముఖ్ రైతు రుణమాఫీ పొందారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతు రుణమాఫీ కింద రితేశ్‌.. ఆయన సోదరుడు అమిత్‌ దేశ్‌ముఖ్‌  4కోట్ల 70లక్షలు లోన్‌ తీసుకున్నట్లు, కొన్ని డాక్యుమెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన రితేశ్‌ దేశ్‌ముఖ్‌.. మేము ఎలాంటి లోన్‌ తీసుకోలేదని స్పష్టం చేశారు. రుణమే తీసుకోనప్పుడు అది రుణమాఫీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.

సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోన్న డాక్యుమెంట్స్‌  ఏవీ కూడా నిజం కాదన్నారు. ఆ డాక్యుమెంట్స్‌ను పోస్ట్‌ చేసిన మధుపూర్ణిమ కిశ్వర్‌ అనే మహిళ.. రితేశ్‌ స్పందన తర్వాత తన పోస్ట్‌ను తొలగిస్తూ క్షమాపణలు కోరింది. తన ఫ్రెండ్‌ ఒక లింక్‌ను తనకు షేర్‌ చేస్తే అదే నిజ​మని నమ్మి తాను పోస్ట్‌ చేసినట్లు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగవని తెలిపింది. 
Read More : ప్రొడ్యూసర్‌ కీచక పోస్టు : డేనియల్‌ పోస్ట్‌పై తీవ్ర విమర్శలు