Vaishnav Tej : ఆ నటితో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో

మెగా హీరో వైష్ణవ్ తేజ్‌కి హీరోయిన్ రీతూ వర్మకి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ రూమర్స్‌పై వైష్ణవ్ తేజ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Vaishnav Tej

Vaishnav Tej : మెగా హీరో వైష్ణవ్ తేజ్‌కి, హీరోయిన్ రీతూ వర్మకి సమ్ థింగ్ సమ్ థింగ్.. అంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంపై వైష్ణవ్ తేజ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Salaar Trailer : సలార్ ట్రైలర్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ వైఫ్.. వెయిటింగ్ అంటున్న ఫ్యాన్స్..

ఇటీవల ఏ ఫంక్షన్లలో అయినా కొంచెం చనువుగా ఏ సెలబ్రిటీలు కనిపించినా వారి మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టడం కామన్ అయిపోయింది. వెంటనే వారి గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. అలాగే ఇటీవల వైష్ణవ్ తేజ్, రీతూ వర్మల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అసలు వాస్తవమేంటో క్లారిటీ ఇచ్చారు వైష్ణవ్ తేజ్.

నిహారిక ఫ్రెండ్‌గా మెగా ఫ్యామిలీ ఇంట్లో ఏ పార్టీ జరిగినా అటెండ్ అవుతూ వచ్చింది లావణ్య త్రిపాఠి. కట్ చేస్తే వరుణ్-లావణ్య మధ్య ప్రేమాయణం ఉందంటూ వార్తలు వచ్చాయి. అదే నిజమై ఆ జంట పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వారి పెళ్లికి అల్లు అర్జున్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో రీతూ వర్మ కనిపించింది. అంతే వైష్ణవ్ తేజ్‌తో లింక్ చేస్తూ వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి.

Vinod Thomas : కారులో శవమై కనిపించిన నటుడు

రీతు వర్మతో లవ్ అఫైర్‌పై వైష్ణవ్ తేజ్ వివరణ ఇచ్చారు. రీతూ లావణ్యకి మంచి ఫ్రెండ్ అని.. అందుకనే పార్టీకి వచ్చిందని పెళ్లికి కూడా వచ్చిందని.. అంతకు మించి ఏమీ లేదని చెప్పారు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ నవంబర్ 24 విడుదలవుతున్న తన సినిమా ‘ఆది కేశవ’ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ పక్కన శ్రీలీల జోడిగా నటించారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేసారు.