Valentines Day special poster From Mario movie
వినూత్న కథా కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన. నాటకం, తీస్‌మార్ ఖాన్ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ మారియో.
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో అనిరుధ్ హీరోగా పరిచయం అవుతుండగా హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తోంది.
Beauty : డైరెక్టర్ మారుతి టీమ్ నుంచి మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. బ్యూటీ టీజర్ చూశారా?
కాగా.. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఓ ఎరుపు రంగు కారు వెలుతుండగా దాని వెనుక పోలీసులు ఛేజ్ చేస్తున్న ఫోటో ఆకట్టుకుంటోంది. దీనికి ఫడ్ రైడ్ అనే క్యాప్షన్ ఇచ్చింది.
Prabhas- Jr NTR : తమిళ డైరెక్టర్‌తో ప్రభాస్, ఎన్టీఆర్ మల్టీస్టారర్..!
దీంతో ఈ చిత్రం వినోదాత్మకంగా ఉండబోతుందని అర్థమవుతోంది. అడ్వెంచర్ కామెడీ థ్రిల్లర్‌గా రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు.