Prabhas- Jr NTR : తమిళ డైరెక్టర్‌తో ప్రభాస్, ఎన్టీఆర్ మల్టీస్టారర్..!

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Prabhas- Jr NTR : తమిళ డైరెక్టర్‌తో ప్రభాస్, ఎన్టీఆర్ మల్టీస్టారర్..!

Prabhas NTR multistarrer with Tamil director

Updated On : February 15, 2025 / 11:54 AM IST

Gossip Garage : వారిద్ద‌రు పాన్ ఇండియ‌న్ స్టార్లు. వారిద్ద‌రికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్. అటు డార్లింగ్‌, ఇటు జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా ఫ్యాన్స్‌కు పూన‌కాలే వ‌స్తాయి. ఆ ఇద్ద‌రు పెద్ద హీరోలు ఒకే ఫ్రేమ్‌లో క‌నిపిస్తే బొమ్మ ద‌ద్ద‌రిల్లి పోవాల్సిందే. అలాంటి రేర్ కాంబినేష‌న్‌తో సినిమా తీయ‌బోతున్నాడ‌ట ఓ డైరెక్ట‌ర్‌.

డార్లింగ్‌ ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలు అంటేనే ఫ్యాన్స్‌కు ఫుల్‌ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది ఆ ఇద్దరు హీరోలు కలిసి మూవీ చేస్తున్నారంటే టాక్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ సినిమాగానే చెప్పుకోవచ్చు. అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి.. ప్రభాస్‌, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ప్యాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరు చాలా సినిమాలతో బిజీగా ఉన్నా.. రాజ్‌కుమార్‌ చెప్పిన స్టోరీ లైన్‌ విన్నారట.

Jacqueline Fernandez : జైలు నుంచే హీరోయిన్‌కి లవ్ లెటర్.. ఏకంగా ప్రైవేట్ జెట్ గిఫ్ట్ ఇచ్చిన ఘనుడు..

ఈ ఇద్దరి హీరోల కోసం ఇప్పటికే స్టోరీ ప్రిపేర్‌ చేసి పెట్టాడట అమరన్‌ డైరెక్టర్‌ రాజ్ కుమార్ పెరియస్వామి. స్టోరీ లైన్ విన్న ప్రభాస్‌, జూనియర్ ఎన్టీఆర్‌ ఎక్సయిట్ అయ్యారని టాక్. కానీ ఇంకా ప్రాజెక్టు కన్ఫర్మ్ కాలేదని అంటున్నారు. తాము చేయాల్సిన సినిమాలు చాలా ఉండటంతో.. అవి కంప్లీట్ అయ్యే వరకు వెయిట్‌ చేయాలని అనుకుంటున్నట్లు టాక్.

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్

మరో వన్‌ ఇయర్‌ తర్వాత ప్రభాస్‌, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై అఫిషియల్ అనౌన్స్ మెంట్‌ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ప్రభాస్, ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మాత్రం అది మరో బ్లాక్‌ బస్టర్‌ పాన్ వరల్డ్ మూవీ కావటం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఇది గాసిపేనా లేక రియలా అనేది వేచి చూడాలి మరి.