Jacqueline Fernandez : జైలు నుంచే హీరోయిన్‌కి లవ్ లెటర్.. ఏకంగా ప్రైవేట్ జెట్ గిఫ్ట్ ఇచ్చిన ఘనుడు..
బాలీవుడ్ నటికి ఆర్థిక నేరగాడు వాలంటైన్స్ డే సందర్భంగా ఓ ప్రైవేట్ జెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.

Sukesh Chandrashekhar gifts Jacqueline Fernandez a private jet on Valentines Day
వాలంటైన్స్ డే ను పురస్కరించుకుని జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఓ ప్రేమలేఖ రాశాడు. మరో జన్మంటూ ఉంటే జాక్వెలిన్ హృదయంగా పుట్టాలని ఉందని ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేనా.. ఆమె కోసం ఓ ప్రైవేటు జెట్‌ను సైతం కానుకగా ఇస్తున్నట్లు పేర్కొన్నాడు.
“హ్యాపీ వాలంటైన్స్‌డే బేబీ.. ఈ సంవత్సరం మనకు ఎంతో సానుకూలంగా ప్రారంభమైంది. జీవితాంతం ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు అడుగుదూరంలో నిలిచాం.” అని ఆ లేఖలో రాసుకొచ్చాడు. జాక్వెలిన్ అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపాడు. ఈ వరల్డ్‌లోనే ఆమె అద్భుతమైన ప్రియురాలు అని ఆమెను పిచ్చివాడిలా ప్రేమిస్తున్నట్లు అందులో చెప్పుకొచ్చాడు.
ALSO READ : తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్
ఇక సినిమాల షూటింగ్ కోసం జాక్వెలిన్ విదేశాలకు ప్రయాణిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పేర్కొంటూ ఆమెకు ఓ ప్రైవేటు జెట్‌ని బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పాడు. ఇక ఆ జెట్ పై జాక్వెలిన్ పేరులోని మొదటి రెండు అక్షరాలు రాసి ఉంటాయన్నాడు. జాక్వెలిన్ పుట్టిన తేదీతోనే రిజిస్ట్రేషన్ నంబర్ సైతం తీసుకున్నట్లుగా తెలిపాడు. తాను గిఫ్ట్‌గా ఇస్తున్న జెట్‌లో ఆమె సౌకర్యవంతంగా ప్రయాణిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
ఇక తనకు ఒకే ఒక కోరిక ఉందని, అది కూడా మరో జన్మంటూ ఉంటే.. జాక్వెలిన్ హృదయంగా పుట్టాలని ఉందని వెల్లడించాడు. తనలాంటి అద్భుమైన, అందమైన మనిషిని ప్రియురాలిగా కలిగి ఉన్నందుకు ఈ భూమ్మీద అందరి కంటే తానే అదృష్టవంతుడినని ఆ లేఖలో సుఖేశ్ రాసుకొచ్చాడు.
ఇంతకీ సుఖేశ్ ఎవరు ?
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూలు చేశాడు. అనంతరం బెయిల్ విషయాన్ని దాటవేయడంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పోలీస్ ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2021 నుంచి అతడు జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో జాక్వెలిన్‌తో అతడు క్లోజ్‌గా దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి.
జాక్వెలిన్ తన ప్రియురాలు అని సుఖేశ్ చెబుతున్నాడు. అయితే..అతడు తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని వాపోయింది జాక్వెలియన్ ఫెర్నాండెజ్. ఇదే విషయాన్ని న్యాయస్థానం ఎదుట సైతం చెప్పింది. ఇంత జరిగినా కూడా అతడు మాత్రం జైలు నుంచి ప్రేమలేఖలు రాస్తునే ఉన్నాడు. ప్రతి పండుగకు బహుమతులు పంపిస్తూనే ఉన్నాడు.