తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్
తమన్ కు బాలయ్య ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారు.

Music Director thaman Gets Costly Car As Gift by Nandamuri Balakrishna
హీరో నందమూరి బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ను ఊపేశాయి. బాలయ్య సినిమాకు తమన్ ఇచ్చే సంగీతం ఓ రేంజ్‌లో ఉంటుంది. థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు బద్దలు అవ్వాల్సిందే. సినిమాతో పాటు వ్యక్తిగతంగా కూడా బాలయ్య, తమన్‌ల మధ్య మంచి రిలేషన్ ఉంది.
ఇక బాలయ్య అభిమానులు తమన్‌ను నందమూరి తమన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానాన్ని చాటుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో డాకు మమారాజ్ విజయోత్సవ వేడుకల్లో బాలయ్య సైతం తమన్‌కు ఓ పేరు పెట్టారు. నందమూరి తమన్ కాదు.. ఎన్బీకే (నందమూరి బాలకృష్ణ) తమన్ అంటూ పేరు పెట్టారు.
Hey Chikittha : పవన్ కళ్యాణ్ సాంగ్ టైటిల్ తో సినిమా.. ‘హే చికితా’ పోస్టర్ అదిరిందిగా..
ఇక తాజాగా తమన్‌కు ఓ ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు బాలయ్య. తమన్‌కు బాలయ్య కారును ఇస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా..ఈ కారు విలువ కోటికి పైనే ఉంటుందని సమాచారం.
తమన్, బాలయ్య కాంబోలో ఇప్పటి వరకు అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలు వచ్చాయి. ఇవి అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. ప్రస్తుతం బాలయ్య అఖండ 2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి కూడా తమన్‌నే సంగీతం అందిస్తున్నాడు. అఖండ 2కి కూడా థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు బద్దలు అవుతాయని ఇప్పటికే ఓ సందర్భంలో తమన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
అఖండ చిత్రానికి సీక్వెల్‌గా అఖండ 2 మూవీ తెరకెక్కుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తోంది. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.