Operation Valentine : ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ‘వందేమాతరం’ అంటూ దేశభక్తిని చాటుతూ..

'వందేమాతరం' అంటూ దేశభక్తిని చాటుతూ.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

VandeMataram Song release from Varun Tej Operation Valentine movie

Operation Valentine : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్న ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కి సిద్దమవుతుంది.

ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీం.. టీజర్ అండ్ గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేశారు. ‘వందేమాతరం’ అంటూ దేశభక్తిని చాటుతూ సాగే ఈ పాటని ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ‘వాఘా బోర్డర్’లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి ఆ పేట్రియాటిజం సాంగ్ ని మీరు కూడా వినేయండి.

Also read : Sreeleela : మహేష్‌తో సినిమా చేస్తుందని తెలిసి.. ముంబైలోని కాలేజీ శ్రీలీలకి ఎక్స్‌ట్రా మార్కులు వేశారట..

ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇతర దేశంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంతో ఈ మూవీ రూపొందుతుందని తెలుస్తుంది. ఈ చిత్రం పై వరుణ్ తేజ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తన గత చిత్రం ‘గాండీవధారి అర్జున’ మంచి అంచనాలతో రిలీజయ్యి ఆడియన్స్ అంచనాలకు రీచ్ కాలేక నష్టాలు మిగిల్చింది. అయినాసరి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు, హిందీ లాంగ్వేజ్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.