Varalaxmi Sarathkumar comments about her fiance in sabari movie promotions
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే తన ప్రియుడి ‘నికోలయ్’తో ఎంగేజ్మెంట్ జరుపుకొని, తనని ఆడియన్స్ కి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే నికోలయ్ తో ఏడడుగులు కూడా వేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే, వరలక్ష్మి నటించిన కొత్త చిత్రం ‘శబరి’ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో ప్రియుడి నికోలయ్ మరియు సినిమాకి సంబంధించిన విషయాలు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈ శబరి సినిమాని ‘క్రాక్’ మూవీ కంటే ముందే సైన్ చేశారట. కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో.. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందని పేర్కొన్నారు. ఈ సినిమా దర్శకనిర్మాతలు ఇద్దరు ఇండస్ట్రీకి కొత్తవాళ్లే. అయితే కంటెంట్ నచ్చడంతో సినిమాకి సైన్ చేశారట.
కొత్తవారు, చిన్న సినిమా అయినా కంటెంట్ ఉంటే సూపర్ హిట్స్ ని అందుకుంటాయి. వాటికీ నిదర్శనం హనుమాన్, నాంది, కోట బొమ్మాళీ పీఎస్ చిత్రాలని, ఈక్రమంలోనే శబరి కూడా ఆడియన్స్ కి నచ్చుతుందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ మూవీ తల్లి పాత్ర చేస్తున్నట్లు చెప్పుకొచ్చిన వరలక్ష్మి.. పాత్ర నచ్చితే ఏదైనా చేయడానికి సిద్ధమని వెల్లడించారు.
Also read : Aparna Das : ప్రియుడితో ఏడడుగులు వేసేసిన మలయాళ భామ.. ఫోటోలు వైరల్
దర్శకనిర్మాతలు గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీ పడలేదని, దర్శకుడు కూడా సినిమాని బాగా తెరకెక్కించారని పేర్కొన్నారు. ఎమోషనల్ పార్ట్ తో పాటు కమర్షియల్ కంటెంట్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. తెలుగులో ‘కూర్మ నాయకి’, తమిళంలో ధనుష్ సినిమాతో మరో చిత్రం, కన్నడలో సుదీప్ ‘మ్యాక్స్’ చేస్తున్నట్లు, అలాగే మరో మూడు చిత్రాలు కూడా డిస్కషన్స్ లో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాలు, తాను చేసే పాత్రలు గురించి కాబోయే భర్త నికోలయ్ ఏం చెబుతారు..? అని ప్రశ్నించగా, వరలక్ష్మి బదులిస్తూ.. “బాగుంటే బాగుందని, బాలేదంటే బాలేదని చెబుతారు. అయితే ఆయనకు బాలేదని చెప్పే అవకాశం లేదులే” అని చెబుతూ.. తన కాబోయే భర్తని అప్పుడే కంట్రోల్లో పెట్టుకున్నట్లు హింట్ ఇచ్చారు. ఇక పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా.. ఈ ఏడాదిలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు.