Aparna Das : ప్రియుడితో ఏడడుగులు వేసేసిన మలయాళ భామ.. ఫోటోలు వైరల్
ప్రియుడితో ఏడడుగులు వేసేసిన మలయాళ భామ. ఇప్పుడే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. అప్పుడే పెళ్లి చేసేసుకోవడం ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తుంది.

Malayala actress Aparna Das married actor deepak parambol
Aparna Das : ఈ ఇయర్ ఫిలిం ఇండస్ట్రీలో పెళ్లి వార్తలు కొంచెం ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఒక స్టార్ తరువాత మరో స్టార్ పెళ్లిపీటలు ఎక్కుతూ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మలయాళ భామ కూడా మూడు ముళ్ళు వేయించుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేసారు. బీస్ట్, దాదా వంటి సినిమాల్లో నటించి ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న అపర్ణ దాస్ ప్రియుడితో ఏడడుగులు వేసేసారు.
ఇటీవల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మలయాళ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’లో నటించిన దీపక్ పరంబోల్‌తో అపర్ణ గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ లవ్ జర్నీని మ్యారేజ్ జర్నీగా మార్చుతూ ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈ బుధవారం ఓ గుడిలో సంప్రదాయ పద్ధతిలో చాలా సింపుల్ గా పెళ్లిని చేసుకున్నారు.
Also read : Tollywood : దిల్ రాజు సినిమాతో సహా.. వాయిదా పడుతున్న టాలీవుడ్ సినిమాలు.. కారణం అదేనా..?
అయితే హల్దీ, సంగీత్ వంటి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని మాత్రం గ్రాండ్ గానే జరుపుకున్నారు. ఇక ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అపర్ణ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మీ ఆశీర్వాదాలు కావాలంటూ ఆడియన్స్ ని కోరుతున్నారు. ఇక ఈ పోస్టులు చూసిన ఆడియన్స్.. కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అపర్ణ ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీల్ అయ్యిపోతున్నారు.
View this post on Instagram
View this post on Instagram
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న ఈ 28 ఏళ్ళ భామ అప్పుడే పెళ్లి చేసేసుకోవడంతో అభిమానుల హార్ట్ బ్రేక్ అవుతుంది. టిక్ టాక్ తో ఫేమ్ ని సంపాదించుకున్న అపర్ణ.. మలయాళ సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళ్, తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ వస్తున్నారు.