Varalaxmi Sarathkumar new movie Sabari release date update
Varalaxmi Sarathkumar : తెలుగు సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరైన వరలక్ష్మి శరత్ కుమార్.. అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెట్స్ తో కూడా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈక్రమంలోనే పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్న కొత్త చిత్రం ‘శబరి’. కొత్త దర్శకుడు అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. కొత్త కథ, కథనాలతో స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 3న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకొని పెళ్లికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఎంగేజ్మెంట్ వార్త తరువాత వరలక్ష్మి నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే.
Also read : Family Star : సోషల్ మీడియాలో ‘ఫ్యామిలీ స్టార్’పై నెగిటివిటీ.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు..
మరి ఈ మూవీతో వరలక్ష్మి ఆడియన్స్ ని ఎలా అలరిస్తారో చూడాలి. కాగా ఈ చిత్రంలో గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, వైవా రాఘవ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.