Family Star : సోషల్ మీడియాలో ‘ఫ్యామిలీ స్టార్’పై నెగిటివిటీ.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు..
సోషల్ మీడియాలో 'ఫ్యామిలీ స్టార్'పై కావాలని కొందరు నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్నారు. దీంతో వారి పై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు..

Vijay Deverakonda Family Star Movie team files a complaint at cyber crime about negative reviews
Family Star : దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. పరుశురాం డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజైయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని నుంచి ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం మూవీ పై విపరీతమైన నెగటివిటీ వస్తుంది. దీంతో సినిమా చూద్దాం అనుకుంటున్న వారు కూడా థియేటర్ కి వెళ్లకుండా మానేస్తున్నారు.
కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ ఈ నెగటివిటీని వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకొని సినిమాకి నష్టం కలిగేలా చేస్తున్నారు. ఇక ఈ నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్న వారి పై చిత్ర నిర్మాతలు, విజయ్ దేవరకొండ టీం సీరియస్ అయ్యారు. దీంతో ఆ నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా గ్రూప్స్, అక్కౌంట్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ దేవరకొండ పర్సనల్ మేనేజర్ అనురాగ్ పర్వతనేని మరియు ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిషాంత్ కుమార్ ఈ పిర్యాదుని పోలీస్ వారికీ అందజేశారు.
Also read : Family Star : ఆ సమస్య గురించి దిల్ రాజుకి ముందే చెప్పి.. హెచ్చరించిన విజయ్ దేవరకొండ.. ఏంటది..!
ఈ నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్న వారి పై వెంటనే చర్యలు తీసుకోకుంటే సినిమా వసూళ్లపై ప్రభావం పడుతోందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇక కంప్లైంట్ తీసుకున్న పోలీసులు.. వెంటనే కేసుని విచారించి నిందితులను పట్టుకుంటామని మూవీ టీంకి హామీ ఇచ్చారు. కాగా ఈ మూవీ చూసిన ఫ్యామిలీ ఆడియన్స్.. సినిమా చాలా బాగుందని చెప్పడమే కాకుండా, సోషల్ మీడియాలో కావాలనే నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారని చెప్పడం గమనార్హం.