Sabari Movie Song : తల్లీకూతుళ్ల అనుబంధం.. వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ నుంచి ఈ క్యూట్ సాంగ్ విన్నారా?

తాజాగా 'శబరి' నుంచి 'అనగనగా ఒక కథలా.. ఓ చందమామ.. కడవరకు కరగదులే ఈ అమ్మ ప్రేమ..' అంటూ సాగిన తల్లీకూతుళ్ల అనుబంధం చెప్పే క్యూట్ సాంగ్ ని విడుదల చేశారు.

Sabari Movie Song : తల్లీకూతుళ్ల అనుబంధం.. వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ నుంచి ఈ క్యూట్ సాంగ్ విన్నారా?

Varalaxmi Sarathkumar Sabari Movie Cute Mother Daughter Song Released by Chandrabose

Updated On : April 27, 2024 / 2:30 PM IST

Sabari Movie Song : టాలీవుడ్ లో వరుస సినిమాలతో మెప్పిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘శబరి’తో రాబోతుంది. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శబరి. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే శబరి సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘అనగనగా ఒక కథలా.. ఓ చందమామ.. కడవరకు కరగదులే ఈ అమ్మ ప్రేమ..’ అంటూ సాగిన తల్లీకూతుళ్ల అనుబంధం చెప్పే క్యూట్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటని రహమాన్ రాయగా గోపిసుందర్ సంగీత దర్శకత్వంలో KS చిత్ర గారు పాడారు. ప్రస్తుతం ఈ మెలోడీ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ పాటని మీరు కూడా వినేయండి.

Also Read : C.D(Criminal Or Devil) Trailer : నన్ను చంపడానికి వచ్చింది ఎవరు.. అదా శర్మ ‘క్రిమనల్ or డెవిల్’ ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయిన అదా శర్మ ఫైట్స్..

ఇక ఈ అనగనగా ఒక కథలా.. సాంగ్ ని ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాటకి చంద్రబోస్ సతీమణి సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ చేయడం విశేషం. అంతేకాక భార్య చేసిన పాటని చంద్రబోస్ విడుదల చేయడం ఇదే మొదటిసారి. పాట రిలీజ్ చేసిన అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ… శబరి లోని ఈ పాట చాలా బాగుంది. రిలీజ్ కంటే ముందే నేను ఈ పాట మా ఆవిడ ద్వారా విన్నాను. నా భార్య సుచిత్ర ఈ పాటకి కొరియోగ్రఫీ చేయడానికి ఇంటికి తీసుకువచ్చింది. అప్పుడు పాట నచ్చి సాహిత్యం చదివాను. చాలా బాగా రాశారు. ఎవరు రాశారు? ఏంటి అని అప్పుడే ఫోన్ చేసి మాట్లాడాను. మంచి బాణీకి అందమైన భావాలతో కూడిన సాహిత్యంతో రాసిన ఈ పాట నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతతో పాటు సుచిత్రా చంద్రబోస్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ శబరి సినిమా మే 3న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Varalaxmi Sarathkumar Sabari Movie Cute Mother Daughter Song Released by Chandrabose