Varalaxmi Sarathkumar Sabari Movie Gets Dasari Film Award
Sabari Movie : వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా గత సంవత్సరం మేలో ‘శబరి’ అనే సినిమా రిలీజయింది. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శబరి సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా sunNXT ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
తాజాగా ఈ సినిమా దాసరి ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ కథా చిత్రంగా అవార్డు సాధించింది. ఒక తల్లి తన కూతుర్ని కాపాడుకోవాలి, తన కూతురు కోసం చేసే పోరాటంతో ఈ సినిమా తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లింగ్ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ప్రతి సంవత్సరం జరిగే దాసరి ఫిలిం అవార్డ్స్ తాజాగా జరగ్గా ఇందులో ఉత్తమ కథా చిత్రం అవార్డు అందుకుంది శబరి సినిమా.
Also Read : Kingdom Song : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
ఈ అవార్డుని నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల అనిల్ రావిపూడి, సాయి కుమార్, సుమన్, మురళి మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సినిమా నిర్మాతగా మహేంద్ర నాథ్ కూండ్లకు మొదటి సినిమా కావడం గమనార్హం. మొదటి సినిమాకు ఇలాంటి డిఫరెంట్ కథ, ఎమోషన్స్ ఉన్న సినిమా తీయడం గ్రేట్ అని అవార్డ్స్ కమిటీ ప్రశంసించింది.