Varalaxmi Saratkumar : వరుస సినిమా ఆఫర్లతో హైదరాబాద్‌కి మకాం మార్చిన తమిళ స్టార్

లుగులో బిజీ అవుతుండటంతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చేసింది. ఇటీవలే తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న వరలక్ష్మి తన బర్త్ డే....

Varalaxmi

Varalaxmi Saratkumar :  ఒకప్పటి స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె, కోలీవుడ్‌ స్టార్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అటు తమిళ్, ఇటు తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒకపక్క హీరోయిన్ గా మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా వచ్చిన ప్రతి సినిమాని చేస్తుంది. ఇటీవల తను తెలుగులో చేసిన క్రాక్‌, నాంది సినిమాలు విజయం సాధించడంతో పాటు ఈమె నటనకి మంచి మార్కులు పడటంతో తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తెలుగులో వరలక్ష్మికి దాదాపు అరడజను పైగా సినిమాలు చేతిలో ఉన్నాయి.

 

తెలుగులో బిజీ అవుతుండటంతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చేసింది. ఇటీవలే తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న వరలక్ష్మి తన బర్త్ డే వీడియో షేర్ చేయడంతో పాటు తాను హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాను అని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

Pooja Hegde : ప్రభాస్‌కు నాకు ఎలాంటి గొడవ జరగలేదు.. అవన్నీ వట్టి పుకార్లే..

తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్న వీడియో షేర్ చేస్తూ.. ”ఇది నా లైఫ్‌లోనే బెస్ట్‌ బర్త్‌డే. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కృతజ్ఞతలు. మీరంతా కలిసి ఈ బర్త్‌డే ఎంతో స్పెషల్‌గా చేశారు. కష్టసుఖాల్లో నాకు సపోర్ట్ ఉన్న అందరికీ థ్యాంక్స్‌. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అదే హైదరాబాద్‌. నేను హైదరాబాద్‌కు అధికారికంగా షిఫ్ట్‌ అయ్యాను. నాకు కొంత భయంగా, ఆందోళనగా ఉంది. కానీ అంతా మంచే జరుగుతుందని నాకు తెలుసు. నేను ఎక్కడున్నా మీరంతా నా వెనకే ఉంటారని తెలుసు. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్‌ చెప్పినా తక్కువే అవుతుంది. మిమ్మల్ని స్నేహితులుగా పిలవలేను, ఎందుకంటే మీరే నా కుటుంబం. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది వరలక్ష్మి శరత్‌ కుమార్‌.