Varanasi Soumya : మెట్లపై నుంచి జారి పడే సీన్.. నిజంగానే జారి పడ్డ మేఘ సందేశం సీరియల్ నటి.. ప్రోమో వైరల్..

తాజాగా సౌమ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మేఘ సందేశం సీరియల్ రీసెంట్ ఎపిసోడ్ ప్రోమోని షేర్ చేసింది.

Varanasi Soumya Shares Megha Sandesam Serial Promo She felt from Steps in Shoot

Varanasi Soumya : ఒక్కోసారి సినిమాలు, సీరియల్స్ లో చేసే యాక్షన్ సీన్స్ లో నిజంగానే దెబ్బలు తగిలించుకుంటారు నటీనటులు. తాజాగా ఓ సీరియల్ నటి నిజంగానే జారి పడింది. పలు టీవీ సీరియల్స్, టీవీ షోలు, యాంకరింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న వారణాసి సౌమ్య ప్రస్తుతం మేఘ సందేశం సీరియల్ లో నటిస్తుంది.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సౌమ్య గత కొన్నాళ్ల నుంచి ఏ పోస్ట్ పెట్టట్లేదు, ఏమైంది అనుకున్నారు. తాజాగా సౌమ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మేఘ సందేశం సీరియల్ రీసెంట్ ఎపిసోడ్ ప్రోమోని షేర్ చేసింది. ఆ ప్రోమోలో సౌమ్య పాత్ర మెట్ల మీద నుంచి జారి పడితే హాస్పిటల్ కి కార్ లో తీసుకెళ్లినట్టు ఉంది.

Also See : Redin Kingsley : మొదటిసారి భార్య, పాపతో కలిసి ఫోటోలు షేర్ చేసిన కమెడియన్.. ఫోటోలు వైరల్..

అయితే ఈ ప్రోమోని షేర్ చేసి.. షూట్ లో అక్కడ నిజంగానే జారి పడ్డాను. అదృష్టం బాగుండి పెద్ద దెబ్బలు తగల్లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము అని రాసుకొచ్చింది సౌమ్య. దీంతో సీరియల్ లో జారి పడినట్టు యాక్ట్ చేయబోయి నటి సౌమ్య నిజంగానే జారి పడిందని, పెద్దగా దెబ్బలు తగలకపోయినా చిన్న చిన్న గాయాలు అయ్యాయని తెలుస్తుంది. దీంతో ఆమె ఫ్యాన్స్, పలువురు నెటిజన్లు సౌమ్య త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

సౌమ్య జారిపడ్డ మేఘసందేశం సీరియల్ ఎపిసోడ్ ప్రోమో ఇక్కడ చూడండి..