Varun Dhawan Bhediya Movie Trialer Released
Bhediya Movie: ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు “వరుణ్ ధావన్”. ఈ యువ కథానాయకుడు ఇప్పుడు ఒక సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దాదాపు రూ.220 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తోడేలు మనిషి పాత్ర పోషించబోతున్నాడు.
Varun Dhawan : వోల్ఫ్‌గా వరణ్ ధావన్!
పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. అనుకోని సంఘటనల కారణంగా హీరో వరుణ్ ని ఒక తోడేలు కరుస్తుంది. ఆ గాయం వలన హీరో శరీరంలో కొన్ని జెన్యూ మార్పులు జరిగి, తోడేలులా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే, పౌర్ణమి నాడు పూర్తిస్థాయి తోడేలుగా మారిపోయి ప్రజలపై దాడి కూడా చేస్తాడు.
ఇక ఈ సమస్య నుంచి ఎలాగైనా బయట పడాలని అతడి ఫ్రెండ్స్ సహాయం కోరతాడు. ఆ సమస్య నుంచి బయటపడ్డాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అయితే ఇటువంటి సినిమాలో హాలీవుడ్ లో చాలానే వచ్చాయి. మరి ఈ సినిమాతో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది.