Varun Sandesh comments in Constable Movie pre release event
Varun Sandesh : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన చిత్రం కానిస్టేబుల్. ఆర్యన్ సుభాన్ ఎస్.కె.దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) మాట్లాడుతూ..తన కెరీర్‌లో అక్టోబర్ నెలను మరిచిపోలేన్నాడు. 18 ఏళ్ల క్రితం తాను నటించిన మొదటి చిత్రం హ్యాలీడేస్ 2007 అక్టోబర్ నెలలోనే విడుదలై ఘన విజయం సాధించి తన కెరీర్‌నే మలుపు తిప్పిందన్నారు. అందుకనే అక్టోబర్ నెల తన జీవితంలో గుర్తుండిపోతుందన్నారు.
Mithra Mandali Trailer : ఆకట్టుకుంటున్న మిత్ర మండలి ట్రైలర్..
ఇప్పుడు కానిస్టేబుల్ సినిమా కూడా ఇదే నెలలో విడుదల అవుతుండడంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని మలచడం జరిగిందన్నారు.
ఇక నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ.. తమ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు. శుక్రవారం (అక్టోబర్ 10న) ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నారు. ఓ అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని ఈ చిత్రంలో చూపించినట్లుగా తెలిపారు. అమ్మాయిలతో పాటు తల్లిదండ్రులు ఈ చిత్రాన్ని చూడాలన్నారు.
Sai kiran : తండ్రి కాబోతున్న నటుడు సాయికిరణ్..
ఈ చిత్ర ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన చూసి సినిమా పట్ల మరింత నమ్మకం పెరిగిందని దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎన్.కె తెలిపాడు.