Sai kiran : తండ్రి కాబోతున్న నటుడు సాయికిరణ్..
నటుడు సాయికిరణ్ (Sai kiran) త్వరలో తండ్రికాబోతున్నాడు.

Actor Sai kiran and Sravanthi will become parents soon
Sai kiran : నటుడు సాయికిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నువ్వే కావాలి, ప్రేమించు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. ఆ తరువాత సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు బుల్లితెరపై బిజీగా ఉన్నాడు. కోయిలమ్మ, గుప్పెడంత మనసు, పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో తనదైన ముద్ర వేశాడు.
గతేడాది డిసెంబర్ ఆయన తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా స్రవంతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram
సాయి కిరణ్ 2010లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే.. మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న సాయి కిరణ్ గతేడాది డిసెంబర్‌లో స్రవంతిని వివాహం చేసుకున్నాడు.