Varun Sandesh
Varun Sandesh : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా తెరకెక్కుతున్న సినిమా కానిస్టేబుల్. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఓ ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేసారు.(Varun Sandesh)
కానిస్టేబుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ పాటను ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ పాటను రామారావు రాయగా సుభాష్ ఆనంద్ సంగీత దర్శకత్వంలో ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ పాడటం గమనార్హం. మీరు కూడా ఈ ఎమోషనల్ సాంగ్ వినేయండి..
Also See : CM Chandrababu Naidu : జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు..
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. సమాజంలో పోలీసులు పోషిస్త్తున్న పాత్ర, చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసులు సమాజానికి స్ఫూర్తిదాయకం. నిజాయితీ కలిగిన ఓ కానిస్టేబుల్ కథతో ఈ సినిమా తీయడం అభినందనీయం. ఇవాళ నేను ఆవిష్కరించిన ఎమోషనల్ పాట మనసును ఎంతగానో హత్తుకుంటోంది. నా కళ్ళు చమర్చాయి అని అన్నారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నేను ఇంతవరకు నటించిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో పాత్ర ఉంటుంది అని అన్నారు. నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ సినిమా అక్టోబర్ 10న ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ కాబోతుంది అని తెలిపారు.
Also Read : OG Comic Book : పవన్ కళ్యాణ్ OG కామిక్ బుక్ వచ్చేసింది.. ఇక్కడ ఆర్డర్ చేసుకోండి..
డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. ట్రైలర్ కి ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఎమోషనల్ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు లొకేషన్ లో ప్రజలు నిజమైన సన్నివేశం అనుకుని కన్నీరు కార్చారు అని తెలిపాడు.