Viraaji : ఓటీటీలోకి వచ్చిన ఒక్కరోజులోనే అదిరిపోయే వ్యూస్.. ‘విరాజి’ సక్సెస్ మీట్..

విరాజి మూవీ యూనిట్ మరో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు.

Varun Sandesh Viraaji Movie Streaming in Aha Ott getting Good Response

Viraaji : వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరాజి’. మహా మూవీస్, M3 మీడియా బ్యానర్స్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో తెరకెక్కిన విరాజి ఇటీవల ఆగస్టు 2న థియేటర్స్ లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో విరాజి ప్రేక్షకులని మెప్పించింది.

తాజాగా విరాజి సినిమా ఆగస్టు 22 న ఆహా ఓటీటీలో రిలీజయింది. ఆహా ఓటీటీలో వరుణ్ సందేశ్ విరాజి సినిమా ఒక్క రోజులోనే ఏకంగా 56 లక్షల వాచ్ మినిట్స్ ని సాధించి ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా విరాజి మూవీ యూనిట్ మరో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు.

Also Read : Arshad Warsi – Prabhas : డార్లింగ్‌పై అర్షద్‌ వర్సీ కామెంట్స్‌ను లైట్‌ తీసుకున్నారా?

విరాజి సక్సెస్ మీట్ లో నటుడు వైవా రాఘవ మాట్లాడుతూ.. విరాజి సినిమాని థియేటర్స్ లో ఆదరించారు, ఇప్పుడు ఓటీటీలో ఆదరిస్తున్నారు. నేను చేసిన రోల్ కు కూడా మంచి గుర్తింపు దక్కింది అని అన్నారు. నటుడు కాకినాడ నాని మాట్లాడుతూ.. విరాజి సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాత గారికి థ్యాంక్స్. ఈ సినిమా కోసం వరుణ్ సందేశ్ ఎంతో కష్టపడ్డాడు. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఆహా ఓటీటీలోచూసేయండి అని తెలిపారు.

నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. ఈ నెల 2న థియేట్రికల్ గా విరాజి రిలీజ్ చేసాము. కానీ ఆ రోజు ఎక్కువ సినిమాలు ఉండటం వల్ల మా సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది. అందుకే త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చాము. ఇప్పుడు ఆహా ఓటీటీలో విరాజి మంచి వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా విషయంలో ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా మా హీరో వరుణ్ సందేశ్ బాగా సపోర్ట్ చేసారు అని తెలిపారు.

ఇక హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. విరాజి సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటికే 56 లక్షల వాచ్ మినిట్స్ తో ట్రెండింగ్ లో ఉండటం సంతోషంగా ఉంది. నేడు మా నిర్మాత మహేంద్రనాథ్ గారి పుట్టినరోజు. ఇది ఆయనకు బర్త్ డే గిఫ్ట్ గా వచ్చింది. ఒక మంచి సినిమాని డైరెక్టర్ ఆద్యంత్ హర్ష తెరకెక్కించాడు. ఆగస్టు 2న మేము అనుకున్న స్థాయిలో థియేటర్స్ దొరకలేదు. అందుకే ఇప్పుడు థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు