Arshad Warsi – Prabhas : డార్లింగ్‌పై అర్షద్ వర్సీ కామెంట్స్‌ను లైట్ తీసుకున్నారా?
Arshad Warsi - Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..కల్కి సినిమాలో జోకర్‌లా ఉన్నాడంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడి నోరుపారేసుకున్నారు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి. అమితా బచ్చన్‌ను మాత్రం ఆకాశానికి ఎత్తాడు.

Arshad Warsi - Prabhas
Arshad Warsi – Prabhas : తెలుగు సినిమాను విశ్వవాప్తం చేసిన నటుడు. ఇండియన్ మూవీకి ప్రపంచ వేదిక మీద గౌరవం దక్కడానికి కారణమైన డార్లింగ్‌ను..బాలీవుడ్ కమెడియన్ హద్దు దాటి కామెంట్ చేశాడు. ఫేమస్ అవ్వాలనుకున్నాడా లేక నోటీ దూలతో అలా ట్వీట్ చేశాడో తెలియదు కానీ..సలార్‌ను అనరాని మాటలు అన్నాడు. మా హీరోని పట్టుకుని జోకర్ అంటావా..నీకెంత ధైర్యమంటూ వాయించేస్తున్నారు ఫ్యాన్స్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..కల్కి సినిమాలో జోకర్‌లా ఉన్నాడంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడి నోరుపారేసుకున్నారు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి. అమితా బచ్చన్‌ను మాత్రం ఆకాశానికి ఎత్తాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారుతున్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అర్షద్ వార్సికి ఇచ్చి పడేస్తున్నారు. కామెంట్లు, పోస్టులతో ఏసుకుంటున్నారు. కొందరు టాలీవుడు హీరోలు గట్టిగానే రెస్పాండ్ అయ్యారు. హీరో నాని అర్షద్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేశాడు.
Read Also : Prabhas : ప్రభాస్ పై బాలీవుడ్ నటుడి కామెంట్లు.. ఘాటుగా స్పందించిన టాలీవుడ్ నిర్మాత
తన కెరీర్ మొత్తంలో సంపాదించుకోలేనంత పబ్లిసిటీ ప్రభాస్ మీద కామెంట్ చేసి అర్షద్ సంపాదించుకున్నాడు అంటూ సర్కాస్టిక్‌గా చురకలు అంటించాడు. నాని కంటే ముందే సుధీర్ బాబు, సిద్దు కూడా స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు. ఇక ప్రొడ్యూసర్ దిల్‌రాజు కూడా గట్టిగా రెస్పాండ్ అయ్యారు. జోకర్ అన్నంత మాత్రాన జోకర్ అయిపోతారా..ప్రభాస్‌ని అంటేనే కదా పబ్లిసిటీ వస్తుంది..అందుకే అంటారని కౌంటరిచ్చారు.
వీళ్లు రెస్పాండ్ కావడం వరకు ఓకే. కానీ టాలీవుడ్ అగ్రహీరోలు ఎందుకు రెస్పాండ్ కావడం లేదన్న చర్చ జరుగుతోంది. మన బాహుబలిని అంటే ఓ రేంజ్‌లో రియాక్ట్ కావాల్సింది పోయి..లైట్ తీసుకోవడం ఏంటన్న డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేశ్‌బాబు, అల్లుఅర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్లు, రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, పూరీ జగన్నాథ్ వంటి డైరెక్టర్లు ఎందుకు రియాక్ట్ అవడం లేదని..డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మనల్ని కాదు కదా అన్నదని సైలెంట్‌గా ఉంటున్నారా.. లేక పాన్ ఇండియా స్టార్స్ నోరు విప్పడానికి భయపడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది.
కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 వందల కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ఇక బాలీవుడ్‌లో కల్కి హిందీ వర్షన్‌లో 293 కోట్లు వసూళ్లు చేసింది. ఎప్పుడో ఒకసారి తప్ప బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేయడం లేదు. కరెక్ట్‌గా ఇలాంటి టైంలో టాలీవుడ్ సినిమాలు దాదాపు పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అవుతున్నాయి. హిందీలో మన తెలుగు సినిమాలకు మంచి ఆదరణ..వసూళ్లు కూడా భారీగా ఉంటున్నాయి. అందుకని ఇప్పుడు అర్షద్ వార్సిపై మాట్లాడి అనవసరంగా బాలీవుడ్‌లో తమ మార్కెట్‌ను చెడగొట్టుకోవటం ఎందకని మన స్టార్స్ సైలెంట్‌గా ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఒకరో ఇద్దరు చిన్నహీరోలు తప్ప అగ్రహీరోలు ఎవరు నోరు విప్పటం లేదు. మౌనంగా ఉండటమే బెటరనుకుంటున్నారట. మీడియా ఆఫ్ ది రికార్డ్‌లో అడిగినా ఇప్పుడు అర్షద్ వార్సిపై విమర్శలు చేస్తే బాలీవుడ్‌కి టార్గెట్ అవ్వటం తప్ప తమకు ఒరిగెదేం లేదంటున్నారు. అర్షద్ వార్సి ప్రభాస్‌పై కామెంట్ చేసి వారం రోజులకుపైగా అవుతున్నా టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలు స్పందించకపోవడానికి ఇదే కారణం అంటున్నారు.