Varun Tej Lavanya Tripathi First Wedding Anniversary Special Marriage Video Released
Varun- Lavnya : మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓ ఆరేళ్ళు ప్రేమించుకొని గత సంవత్సరం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా సీక్రెట్ గా ప్రేమని దాచి సడెన్ గా నిశ్చితార్థం రోజు అందరికి తెలిసేలా చేసే అందర్నీ ఆశ్చర్యపరిచారు వరుణ్ – లావణ్య. ఇక వీరి పెళ్లి యూరప్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా గ్రాండ్ గా చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ.. పలువురు సన్నిహితుల మధ్య వరుణ్ – లావణ్య పెళ్లి ఘనంగా జరిగింది.
అప్పట్లో వరుణ్ – లావణ్య పెళ్లి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. నేడు వరుణ్ – లావణ్య ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో కలిసి ఓ స్పెషల్ పెళ్లి వీడియోని షేర్ చేసారు. వరుణ్ గురించి లావణ్య, లావణ్య గురించి వరుణ మాట్లాడటం, పెళ్లి వేడుకల్లోని కొన్ని విజువల్స్ ని కలిపి స్పెషల్ గా వీడియో చేసారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో వరుణ్ – లావణ్య పెళ్లి, కుటుంబ సభ్యులు డ్యాన్స్ లు వేయడం, అందరూ ఆప్యాయంగా పలకరించుకోవడం, ఫోటోషూట్స్.. ఇలా అన్ని చూపించారు. మెగా ఫ్యామిలీ అంతా కనిపించి సందడి చేసారు. దీంతో ఈ వీడియో క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ వరుణ్ లావణ్య జంటకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియో చూసేయండి..