Jani Master : జైలు నుంచి వచ్చాక ఫ్యామిలీతో జానీ మాస్టర్ దీపావళి సెలబ్రేషన్స్.. వాళ్ళ కేరింతలే మన సంతోషం అంటూ..

ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్న పలు ఫోటోలను జానీ మాస్టర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Jani Master : జైలు నుంచి వచ్చాక ఫ్యామిలీతో జానీ మాస్టర్ దీపావళి సెలబ్రేషన్స్.. వాళ్ళ కేరింతలే మన సంతోషం అంటూ..

Jani Master Shares Diwali Celebrations with Family Photos

Updated On : November 1, 2024 / 8:25 PM IST

Jani Master : జానీ మాస్టర్ ఇటీవలే జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసారు. విచారణ తర్వాత కొన్నాళ్ళు జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇటీవలే ఈ కేసులో బెయిల్ నుంచి బయటకు వచ్చారు.

Also Read : Pawan Kalyan : OG అని అరిచే బదులు భగవత్ నామం జపించండి.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు…

ప్రస్తుతం జానీ మాస్టర్ తన సొంత ఊరు నెల్లూరులో ఉన్నట్టు తెలుస్తుంది. బెయిల్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. తాజాగా దీపావళి సందర్భంగా తన ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్న పలు ఫోటోలను జానీ మాస్టర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Jani Master Shares Diwali Celebrations with Family Photos

దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను జానీ మాస్టర్ షేర్ చేసి.. వాళ్ళ కేరింతలే మన సంతోషం అంటూ తన పిల్లల గురించి రాసుకొచ్చారు. అలాగే.. ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచాలాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవ్వగా నెటిజన్లు జానీ మాస్టర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.