Varun Tej : వరుణ్ తేజ్ బర్త్ డే.. కొత్త సినిమా అనౌన్స్.. కొరియాలో హారర్ కామెడీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

తాజాగా సరికొత్త సినిమాని ప్రకటించాడు వరుణ్ తేజ్.

Varun Tej New Movie Announced on His Birthday VT15 Poster Released

Varun Tej : వరుణ్ తేజ్ తన ప్రతి సినిమాకు చాలా బాగా కష్టపడతారు. ఆ పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేస్తారు. ప్రతిసారి కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు. కానీ ఎంత కష్టపడినా, ఎలాంటి కథలతో వచ్చినా నిరాశే ఎదురవుతుంది. వరుణ్ గత మూడు సినిమాలు గాండీవధర అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా.. పరాజయం పాలయ్యాయి. దానికి ముందు F3 హిట్ కొట్టినా గాని కూడా ఫ్లాప్ అయింది.

Also Read : Saif Ali Khan Attack Case: సైఫ్‌పై దాడికేసులో అసలైన నిందితుడు అరెస్ట్.. ఎక్కడ పట్టుబడ్డాడంటే..

ఇలాంటి సమయంలో తాజాగా సరికొత్త సినిమాని ప్రకటించాడు వరుణ్ తేజ్. నేడు వరుణ్ పుట్టిన రోజు కావడంతో తన కొత్త సినిమాని ప్ర్తకటించాడు. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ 15వ సినిమాని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఒక చిన్న కుండ ఉంది. కుండపై డ్రాగన్ బొమ్మ ఉంది. చుట్టూ కొరియన్ భాషలో అక్షరాలు ఉన్నాయి. ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఇండో కొరియన్ హారర్ కామెడీ కథ అని ప్రకటించారు మూవీ యూనిట్.

దీంతో వరుణ్ తేజ్ హారర్ కామెడీ కథతో రాబోతున్నట్టు, ఇండియా – కొరియా దేశాలకు సంబంధించి కథ అని తెలుస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ లాస్ట్ మూడు సినిమాలు కృష్ణార్జున యుద్ధం, మ్యాస్ట్రో, లైక్ షేర్ సబ్ స్క్రైబ్.. యావరేజ్ సినిమాలే. మరి హిట్ కోసం చూస్తున్న డైరెక్టర్ – హీరో కలిసి తీస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఇప్పటికైనా వరుణ్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడా చూడాలి.

 

Also Read : Manchu Vishnu : నేను ఏ దేశానికి షిఫ్ట్ అవ్వట్లేదు.. ఎవరికీ భయపడి వెళ్ళను.. విష్ణు కామెంట్స్..