Manchu Vishnu : నేను ఏ దేశానికి షిఫ్ట్ అవ్వట్లేదు.. ఎవరికీ భయపడి వెళ్ళను.. విష్ణు కామెంట్స్..

మనోజ్ కి భయపడి విష్ణు దుబాయ్ షిఫ్ట్ అయిపోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

Manchu Vishnu : నేను ఏ దేశానికి షిఫ్ట్ అవ్వట్లేదు.. ఎవరికీ భయపడి వెళ్ళను.. విష్ణు కామెంట్స్..

Manchu Vishnu Gives Clarity on He Shifting to Dubai

Updated On : January 18, 2025 / 9:50 PM IST

Manchu Vishnu : గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంటి గొడవలు కాస్తా రోడ్డెక్కాయి ఆ తర్వాత పోలీస్ స్టేషన్, కలక్టరేట్ వరకు వెళ్లాయి. వీరి వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. మనోజ్ మాత్రమే ఈ విషయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. అయితే తాజాగా మంచు విష్ణు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలో మనోజ్ కి భయపడి విష్ణు దుబాయ్ షిఫ్ట్ అయిపోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి, పిల్లల్ని విదేశాల్లో చదిరిస్తున్నారు అని, మీరు కూడా వెళ్ళిపోతారని అంటున్నారు నిజమేనా అని అడిగారు.

Also Read : Bhatti Vikramarka : ఉగాది రోజే గద్దర్ అవార్డుల ప్రదానం.. ఇకపై ప్రతి ఉగాదికి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

దీనికి మంచు విష్ణు సమాధానమిస్తూ.. నేను ఎక్కడికి షిఫ్ట్ అవ్వట్లేదు. నా పిల్లలకు నార్మల్ చైల్డ్ హుడ్ ఉండాలి అనుకున్నాను. సినీ పరిశ్రమకు దూరంగా ఉండాలని అక్కడ పెట్టి చదివిస్తున్నాను. వాళ్ళు ఇక్కడ ప్రొటెక్టెడ్ గా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా బయట తిరగాలి, ఎవరూ వచ్చి ఫొటోలు తీసుకోకూడదు, సింపుల్ గా బస్సుల్లో వెళ్ళాలి అందుకే అక్కడ చదివిస్తున్నాను. నేను విదేశాలకు వెళ్తే నార్మల్ మ్యాన్. నాకు అదే నచ్చుతుంది. నాకు స్టార్ అవ్వాలని ఉన్నా ఇక్కడ ప్రైవసీ ఉండదు. నేను తిరుపతి, హైదరాబాద్ లలోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను, నేను ఈ జన్మలో ఎవరికీ భయపడను అని తెలిపాడు.

ఇక నేడు మంచు ఫ్యామిలీ వివాదం కలక్టరేట్ వరకు వెళ్ళింది. మోహన్ బాబు తన జల్ పల్లి ఇంట్లో ఉంటున్న మంచు మనోజ్ ని ఖాళీ చేయించాలని కలెక్టర్ ని కోరారు. దీంతో మనోజ్ కి నోటీసులు పంపించగా మనోజ్ కూడా కలక్టరేట్ కి వెళ్లి మాట్లాడారు. అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇవి ఆస్తి గొడవలు కాదని, వాళ్ళ కాలేజీ విద్యార్థులకు, తిరుపతి దగ్గర వాళ్ళ ఊర్లోని ప్రజలను మోసం చేస్తున్నారని, దానిపై తన పోరాటం అని, తన అన్న వెనకుండి ఇదంతా చేయిస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు. దీంతో మనోజ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Also Read : Identity : త్రిష మలయాళం హిట్ సినిమా ఐడెంటిటీ.. ఇప్పుడు తెలుగులో రిలీజ్.. ఎప్పుడంటే..

ఇటీవల పండగ పూట కూడా మనోజ్ తిరుపతిలోని తమ స్కూల్ లో ఉన్న తాతయ్య సమాధికి నివాళులు అర్పిస్తామని వెళ్లగా విష్ణు, మోహన్ బాబు మనుషులు మనోజ్ ని లోపలికి అనుమతించలేదు, అంతేకాక పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టి మనోజ్ ని లోపలికి రానివ్వకుండా చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరి ఈ మంచు ఫ్యామిలీ గొడవలు ఎప్పటికి చల్లారతాయో చూడాలి.