Varun Tej : వరుణ్ తేజ్ కొత్త సినిమా ఓపెనింగ్.. పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘మట్కా’

కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా VT14వ సినిమా పీరియడ్ యాక్షన్ డ్రామాగా, 1960 బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతుంది, వైరా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. తాజాగా నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి.

Varun Tej New Movie Opening under Karunakumar direction Titled as Matka

Varun Tej New Movie : మెగా హీరోల్లో వరుణ్ తేజ్ కథల ఎంపిక చాలా బాగుంటుంది. సినిమా సినిమాకు కథల్లో వ్యత్యాసం చూపిస్తాడు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా కొత్త కథలతో సినిమాలు తీస్తాడు. ప్రస్తుతం ఈ హీరో త్వరలో గాండీవధారి అర్జునతో రాబోతున్నాడు. ఆ తర్వాత సినిమా VT13 షూటింగ్ జరుపుకుంటుండగా తాజాగా VT14 సినిమా ప్రకటించారు.

టాలీవుడ్ లో పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ వంటి వైవిధ్యమైన మాస్ సినిమాలు తెరకెక్కించి మంచి పేరుని సంపాదించుకున్న దర్శకుడు కరుణ కుమార్. కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా VT14వ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, 1960 బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతుంది, వైరా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. తాజాగా నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి.

NTR : దేవర మూవీపై ఎన్టీఆర్ స్పెషల్ కేర్.. గ్రాఫిక్స్ విషయంలో ఆదిపురుష్ చేసిన తప్పు చేయొద్దని..

అలాగే VT14 సినిమా టైటిల్ కూడా ప్రకటించారు చిత్రయూనిట్. మట్కా అనే మాస్ టైటిల్ ని ప్రకటించి ఓ పోస్టర్ ని కూడా రిలిజ్ చేశారు. దీంతో ఈ సారి కూడా వరుణ్ తేజ్ మరో సరికొత్త కథతో రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కి వెళ్లనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. నోరా ఫతేహి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా నవీన్ చంద్ర కూడా ఓ స్పెషల్ రోల్ చేయనున్నాడు.