NTR : దేవర మూవీపై ఎన్టీఆర్ స్పెషల్ కేర్.. గ్రాఫిక్స్ విషయంలో ఆదిపురుష్ చేసిన తప్పు చేయొద్దని..
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫుల్ మాస్ కమర్షియల్ పాన్ ఇండియా మూవీగా చిత్రీకరణ జరుగుతుంది దేవర.

NTR special concentration on Devara Movie Graphics
Devara : పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ మూవీ దేవరపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు యంగ్ టైగర్. ఇప్పటికే షూటింగ్ నాలుగు షెడ్యూల్స్ పూర్తికాగా.. వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ విషయంలో కూడా మంచి ఎఫర్ట్ పెట్టాలని సూచించారట. ఆదిపురుష్ లాంటి సినిమాల్లో హడావుడిగా గ్రాఫిక్స్ చిత్రీకరించడంతో మంచిగా రాలేదని ఆ సమస్య లేకుండా చూసుకోవాలని డైరెక్టర్ కొరటాల శివకు చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. దేవర మూవీపై ఎన్టీఆర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫుల్ మాస్ కమర్షియల్ పాన్ ఇండియా మూవీగా చిత్రీకరణ జరుగుతుంది దేవర. అయితే దేవరపై చిత్ర కథా నాయకుడు ఎన్టీఆర్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే షూటింగ్ అయిన పార్ట్ కి వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్‌తో కూడిన యాక్షన్ సీన్స్ కూడా తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు చిత్ర యూనిట్. కానీ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ కేర్ తీసుకుని గ్రాఫిక్స్ సీన్లు పూర్తి చేయాలని డైరెక్టర్ కొరటాల శివకు చెప్పారట.
Prabhas : మలయాళం స్టార్ హీరో దర్శకత్వంలో ప్రభాస్? ఇంకో సినిమా లైన్లో పెట్టాడా?
షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన షూటింగ్‌లో ప్రత్యేకంగా గ్రాఫిక్స్‌పై ఫోకస్ పెట్టడం వెనుక భారీ ప్లానే ఉందని ఇండస్ట్రీ టాక్. యాక్షన్ సీన్ల తర్వాత గ్రాఫిక్స్ చేస్తే సింక్ కావడం లేదని అవుట్‌పుట్ బాగా రావడం లేదని టెక్నిషియన్స్ చెబుతున్నారు. హడావుడిగా చేయడం వల్ల క్వాలిటీ దెబ్బతినే అవకాశం ఉన్నందున సమయం ఉన్నప్పుడు గ్రాఫిక్ వర్క్ చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ అభిప్రాయం. ఆదిపురుష్ లా హడావుడిగా గ్రాఫిక్స్ చేయడం వల్ల అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాలేదని అదే ప్లాన్ ప్రకారం చేస్తే ఆ సమస్య వచ్చేది కాదని, దేవరలో అలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని డైరెక్టర్‌కు చెప్పారట జూనియర్ ఎన్టీఆర్. ఇలా హీరో ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఎన్టీఆర్ 30 సినిమా దేవర ఎంత బాగా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.