Operation Valentine : వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’.. ఏ ఓటీటీలో? ఎప్పుడు వస్తుంది అంటే..

ఆపరేషన్ వాలంటైన్ సినిమా నేడు మార్చ్ 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజయింది.

Operation Valentine Movie : వరుణ్ తేజ్(Varun Teja) హీరోగా శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ఆపరేషన్ వాలంటైన్’. మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ.. పలువురు ముఖ్య పాత్రల్లో రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఆపరేషన్ వాలంటైన్ సినిమా నేడు మార్చ్ 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజయింది. నిన్న రాత్రే పలు చోట్ల ప్రీమియర్స్ కూడా వేశారు. పుల్వామా అటాక్, దానికి భారతదేశం ఉగ్రవాదులకు ఇచ్చిన కౌంటర్ అటాక్.. వంటి రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. మన తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని అద్భుతంగా చూపించారు. ఆపరేషన్ వాలెంటైన్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది.

Also Read : Krishna Chaitanya : యాంకర్‌ని పెళ్లి చేసుకున్న దర్శకుడు.. టాలీవుడ్‌లో కొత్త జంట..

ఇక ఆపరేషన్ వాలంటైన్ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ దక్కించుకుంది. నాలుగు వారాల తర్వాత తెలుగు భాషలో అమెజాన్ లో ఆపరేషన్ వాలంటైన్ స్ట్రీమింగ్ అవ్వనుంది. అంటే ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీకి రానుంది. హిందీలో మాత్రం రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుందని సమాచారం. ఇప్పుడు థియేటర్స్ లో కేవలం తెలుగు, హిందీలో రిలీజయిన ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీలో మాత్రం తెలుగు, హిందీతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.

ట్రెండింగ్ వార్తలు