Krishna Chaitanya : యాంకర్‌ని పెళ్లి చేసుకున్న దర్శకుడు.. టాలీవుడ్‌లో కొత్త జంట..

 టాలీవుడ్ లో మరో కొత్త జంట చేరింది. ఓ దర్శకుడు యాంకర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Krishna Chaitanya : యాంకర్‌ని పెళ్లి చేసుకున్న దర్శకుడు.. టాలీవుడ్‌లో కొత్త జంట..

Tollywood Director Kishore Reddy Anchor Krishna Chaitanya Marriage Happened

Updated On : March 1, 2024 / 5:18 PM IST

Krishna Chaitanya : టాలీవుడ్ లో మరో కొత్త జంట చేరింది. ఓ దర్శకుడు యాంకర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శర్వానంద్ తో శ్రీకారం అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ రెడ్డి(Kishore Reddy) ప్రముఖ టాలీవుడ్ యాంకర్ కృష్ణ చైతన్యని వివాహం చేసుకున్నారు. ఆర్జేగా, యాంకర్ గా కృష్ణ చైతన్య టాలీవుడ్ లో ‘కేసీ’గా బాగా పాపులర్ అయింది. కిషోర్ రెడ్డి కూడా ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో దర్శకత్వ శాఖలో పనిచేసి శ్రీకారం సినిమాతో దర్శకుడిగా మారాడు.

Also Read : Hanuman : శివరాత్రి రోజు హనుమంతుడి ఆగమనం.. ‘హనుమాన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్..

నేడు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మామిడిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిషోర్ రెడ్డి – కృష్ణ చైతన్యల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వీరి పెళ్ళికి పలువురు సినీ, టీవీ ప్రముఖులు హాజరయ్యారు. వీరిద్దరిది ప్రేమ వివాహం అని తెలుస్తుంది. వీరి పెళ్లి ఫోటోలు మాత్రం ఇంకా బయటకి రాలేదు. పెళ్ళికి ముందు దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.