Varun Tej postponed his marriage with Lavanya Tripathi in two times for that movie
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. కొన్ని నెలలు క్రిందటే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ళు రహస్య ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ.. గత ఏడాది జూన్ లో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఆ తరువాత ఐదు నెలలకు ఇద్దరు కలిసి ఏడడుగులు వేశారు. అయితే ఈ పెళ్లిని ఒక సినిమా కోసం వరుణ్ తేజ్ రెండుసార్లు వాయిదా వేశారట.
మెగా హీరోల్లో వరుణ్ తేజ్ రూట్ అంతా సపరేట్. రొటీన్ సినిమాలు కాకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రయోగాలు చేస్తూ ముందుకు వెళ్తుంటారు. ఈక్రమంలోనే తన పాత్రకి న్యాయం చేయడం కోసం ఎంతో కష్ట పడుతుంటారు. ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీలోని పాత్రని తనలో లీనం చేసుకొని.. ఒక యజ్ఞంలా షూటింగ్ ని ముందుకు తీసుకు వెళ్తుంటారు. ఈక్రమంలోనే సినిమా పూర్తి అయ్యేవరకు ఆ పాత్రనే ఫీల్ అవుతుంటారు.
Also read : HariHara VeeraMallu : వీరమల్లు కూడా రెండు పార్టులుగా.. ఇరాన్‌లో గ్రాఫిక్ వర్క్స్..
ఆ ఫీల్ చెడిపోగొడదని మరే పర్సనల్ విషయం పై దృష్టి పెట్టారు. ఈ భావనతోనే ఓ సినిమాలోని తన పాత్రకి న్యాయం చేయాలని.. లావణ్యతో పెళ్లిని రెండుసార్లు వాయిదా వేశారట. ఇంతకీ అసలు ఆ సినిమా ఏంటని ఆలోచిస్తున్నారా.. అది మరే సినిమానో కాదు. ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాలో వరుణ్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.
ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ సమయంలోనే మెగా కుటుంబసభ్యులు.. వారిద్దరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారట. కానీ ఆ సినిమా పూర్తి అయ్యేవరకు వరుణ్ పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యారట. దీంతో తమ పెళ్లిని రెండు రెండుసార్లు వాయిదా వేసి నవంబర్ లో వివాహం చేసుకోవాల్సి వచ్చింది.
ఇక ఆపరేషన్ వాలెంటైన్ విషయానికి వస్తే.. 2019లో జరిగిన ‘పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్’ నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో బై లింగువల్ గా తెరకెక్కింది. మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంటే రుహాణి శర్మ, నవదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 1న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.