Vasudheva Sutham : ‘వసుదేవ సుతం దేవం..’ ఈ డివోషనల్ సాంగ్ విన్నారా?

తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌లిరికల్ వీడియోని హీరో ఆకాష్ జగన్నాథ్ రిలీజ్ చేశారు. (Vasudheva Sutham)

Vasudheva Sutham : ‘వసుదేవ సుతం దేవం..’ ఈ డివోషనల్ సాంగ్ విన్నారా?

Vasudheva Sutham

Updated On : November 2, 2025 / 7:18 AM IST

Vasudheva Sutham : చైల్డ్ ఆర్టిస్ట్, సౌత్ లో అనేక సినిమాల్లో నటించిన మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరోగా, నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వసుదేవ సుతం’. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Vasudheva Sutham)

ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌లిరికల్ వీడియోని హీరో ఆకాష్ జగన్నాథ్ రిలీజ్ చేశారు. వసుదేవ సుతం దేవం అంటూ మంచి డివోషనల్ పాటగా సాగింది. ఈ పాటను మణిశర్మ సంగీత దర్శకత్వంలో చైతన్య ప్రసాద్ రాయగా పవన్-శృతిక సముద్రాల పాడారు.

Also Read : SSMB29 : నువ్వు నాశనం చేశావు.. మహేష్ పై రాజమౌళి ఫైర్.. ట్విట్టర్లో మహేష్, రాజమౌళి, ప్రియాంక, పృథ్వీరాజ్ వార్..

మీరు కూడా ఈ డివోషనల్ సాంగ్ వినేయండి..

పాట రిలీజ్ అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. వసుదేవసుతం దేవం పాట చాలా బాగుంది. ఈ పాటను నేను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మహేంద్రన్ మంచి నటుడు. అతనికి ఈ సినిమా హిట్ అవ్వాలి అని అన్నారు.

Vasudheva Sutham Devam Song Released by Akash Jagannadh

Also Read : Rashmika Mandanna : రెమ్యునరేషన్ వద్దన్న రష్మిక.. ఏకంగా డబల్ రెమ్యునరేషన్ ఇస్తున్న తెలుగు నిర్మాతలు..