Fear Review : ‘ఫియర్’ మూవీ రివ్యూ.. వేదిక భయపెట్టిందా?

వేదిక ఫియర్ సినిమా ప్రేక్షకులకు ఫియర్ కలిగిస్తూనే ఓ మంచి మెసేజ్ కూడా చెప్పింది.

Fear Review : ‘ఫియర్’ మూవీ రివ్యూ.. వేదిక భయపెట్టిందా?

Vedhika Suspense Thriller Fear Movie Review and Rating Here

Updated On : December 14, 2024 / 6:47 PM IST

Fear Movie Review : పలు తెలుగు, తమిళ్ సినిమాలతో మెప్పించిన వేదిక తాజాగా మెయిన్ లీడ్ లో ‘ఫియర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్ హరిత గోగినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఫియర్ సినిమా నేడు డిసెంబర్ 14న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్లా, సాహితి దాసరి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. సైకాలజీ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ఈ ఫియర్ మూవీ తెరకెక్కింది.

కథ విషయానికొస్తే.. ఇందు, సింధు (వేదిక – డ్యూయొల్ రోల్) కవలలు. సింధుకు అక్క ఇందు అంటే చాలా ఇష్టం. కానీ సింధుకు చిన్నప్పుడు తల్లి చేసిన ఓ పనితో ఎవరో తనను వెంటాడుతున్నట్టు భయపడుతూ ఉంటుంది. దీంతో చెల్లి సింధు అంటే అక్క ఇందుకి ఇష్టం ఉండదు. సింధు తన క్లాస్ మేట్ సంపత్ (అరవింద్ కృష్ణ)ని ప్రేమిస్తుంది. అది అతి ప్రేమగా మారి సంపత్ తన అక్కతో మాట్లాడినా ఊరుకోదు. అదే సమయంలో ఆమెని ఎవరో చంపడానికి వెంటాడుతున్న భయాలు పెరుగుతాయి. అదే సమయంలో సంపత్ కూడా కనిపించకుండా పోతాడు. దీంతో సింధు ఓ పక్క భయం, ఓ పక్క సంపత్ అని పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుండటంతో ఆమెని మెంటల్ హాస్పిటల్ లో చేరుస్తారు. మరి సంపత్ ఏమయ్యాడు? సింధుని వెంటాడుతున్నది ఎవరు? సింధు మాములు మనిషిగా మారుతుందా? ఇందు సింధు క్లోజ్ అవుతారా? సింధు తల్లి చేసిన పని ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Allu Arjun : మేనల్లుడిని చూసి కన్నీరు పెట్టుకున్న సురేఖ

సినిమా విశ్లేషణ.. రిలీజ్ కి ముందే పలు నేషనల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఫియర్ సినిమా ప్రదర్శించి ఇప్పటికే దాదాపు 70 అవార్డులు గెలుచుకోవడం గమనార్హం. పిల్లల్ని తల్లితండ్రులు ఎలా చూసుకోవాలి అనే మెయిన్ పాయింట్ కి సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఫియర్ సినిమాని తెరకెక్కించారు. చిన్నప్పుడు తల్లి చేసిన ఓ పనివల్ల సైకలాజికల్ గా దెబ్బతిన్న అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది? అది ఆమెకు ఎలాంటి పరిస్థితులు తెచ్చింది? దాని నుంచి ఎలా బయటపడింది అని చూపించారు.

ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగినా సెకండ్ హాఫ్ మాత్రం ఆసక్తిగా కొన్ని ట్విస్టులతో సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నా ఇంకా బలంగా రాసుకోవచ్చు అనిపిస్తాయి. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కథకు హారర్ ఎలిమెంట్స్ జోడించడం కొత్తగా అనిపిస్తుంది. ఆ హారర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను భయపెట్టడానికి బాగానే ట్రై చేసారు. లేడీ డైరెక్టర్ మొదటి సినిమానే ఇలాంటి జానర్ తీసుకోవడం విశేషం. ముఖ్యంగా తల్లి తండ్రులు ఎదిగే పిల్లలతో ఎలా ఉండాలి అనే ఓ పాయింట్ ని థ్రిల్లింగ్ గా చెప్పడం కొత్తగా అనిపిస్తుంది.

fear

నటీనటుల పర్ఫార్మెన్స్.. గతంలో డిఫరెంట్ రోల్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపించే వేదిక ఫియర్ సినిమాలో డ్యూయల్ రోల్ లో ఒదిగిపోయిందని చెప్పొచ్చు. రెండు పాత్రల్లో వేరియేషన్ చూపిస్తూనే సింధు పాత్రలో తను భయపడుతూ మనల్ని భయపెట్టించింది. అరవింద్ కృష్ణ కాసేపే కనిపించినా మెప్పించాడు. మిగిలిన పాత్రల్లో జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్లా, సాహితి దాసరి.. కూడా బాగానే నటించి మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. హారర్ థ్రిల్లర్ కావడంతో డార్క్ విజువల్స్ తో బాగానే చూపించారు. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. మెలోడీ, ప్రేమ కథలకు మ్యూజిక్ ఇచ్చే అనూప్ ఇలాంటి థ్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో కొత్తగా ఉంటుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. కథ సింపుల్ గా ఒక మెసేజ్ ఇచ్చే పాయింట్ అయినా దానికి సరికొత్త స్క్రీన్ ప్లేతో, థ్రిల్లింగ్ గా చెప్పడానికి దర్శకురాలు హరిత గోగినేని సక్సెస్ అయ్యారు. ఇది ఆమె మొదటి సినిమా కావడం విశేషం. అలాగే ఎడిటింగ్ కూడా ఈ సినిమాకు హరిత గోగినేని చేయడం మరో విశేషం. మొదటిసారే లేడీ డైరెక్టర్ కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ కూడా చేసి మెప్పించారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా వేదిక ఫియర్ సినిమా ప్రేక్షకులకు ఫియర్ కలిగిస్తూనే ఓ మంచి మెసేజ్ కూడా చెప్పింది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.