Veekshanam : ‘వీక్షణం’ మూవీ.. రేపే రిలీజ్.. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మిక్సింగ్ జానర్లో..

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Veekshanam : ‘వీక్షణం’ మూవీ.. రేపే రిలీజ్.. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మిక్సింగ్ జానర్లో..

Veekshanam Movie Releasing Date and Pre Release Event Happened Details

Updated On : October 17, 2024 / 6:41 AM IST

Veekshanam : రామ్ కార్తీక్, క‌శ్వి జంటగా తెరకెక్కిన సినిమా ‘వీక్షణం’. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మాణంలో మనోజ్ పల్లేటి దర్శకత్వంలో కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. వీక్షణం సినిమా రేపు అక్టోబర్ 18న థియేటర్స్ లో రిలీజవుతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Also Read : ఆ టీజర్‌ రిలీజ్ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవికి కొత్త టెన్షన్

ఈ ఈవెంట్లో హీరోయిన్ కశ్వి మాట్లాడుతూ.. వీక్షణం సినిమా రిలీజ్ అవుతుంటే ఎగ్జైటింగ్ గా ఉంది. థియేటర్ లో మీరు ఎప్పుడు సినిమా చూస్తారా అని ఎదురు చేస్తున్నాను. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సినిమాని అని తెలిపింది. డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. నేను మా సినిమా వీక్షణం గురించి ఎంతైనా చెప్తాను. ఎందుకంటే ఎవరి బిడ్డ వారికి ముద్దుగానే ఉంటుంది. కానీ మా సినిమాని థియేటర్స్ లో మీరు చూసి ఎలా ఉందో చెపితే సంతోషంగా ఉంటుంది. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలిపారు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. వీక్షణం లాంటి ఒక మంచి స్క్రిప్ట్ నాకు ఇచ్చిన మా డైరెక్టర్ మనోజ్ గారికి థ్యాంక్స్. మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా సరికొత్తగా ఉంటుంది. ఈ శుక్రవారం వీక్షణం సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. థియేటర్స్ లో మా సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి అని అన్నారు.