Veera Simha Reddy: టీఆర్పీ రేటింగ్స్‌కు ఎసరు పెట్టిన వీరసింహారెడ్డి.. బుల్లితెరపై బాలయ్య బ్లాస్ట్ ఎప్పుడంటే..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ ఏప్రిల్ 23న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ కానుంది.

Veera Simha Reddy Locks World Television Premiere Date

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించగా, బాలయ్య మరోసారి తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. పవర్‌ఫుల్ డైలాగులు పేలుస్తూ థియేటర్లలో బాలయ్య రచ్చ చేశాడు. ఈ సినిమాలో డ్యుయెల్ రోల్‌లో నటించి మరోసారి తనదైన మార్క్ వేసుకున్నాడు.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి నయా రికార్డు.. ఓటీటీలో జై బాలయ్య మేనియా!

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్‌తో దుమ్ములేపింది. ఈ సినిమాను ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ చేస్తున్నారు. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. వీరసింహారెడ్డి మూవీని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఏప్రిల్ 23న సాయంత్రం 5.30 గంటలకు టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రముఖ ఛానల్ స్టార్ మా పేర్కొంది. దీంతో ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి బ్లాస్ట్ చేయనుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Veera Simha Reddy: పాన్ ఇండియా మూవీగా వస్తున్న వీరసింహారెడ్డి

బాలయ్య సినిమాలకు బుల్లితెరపై కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుంది. ఈ క్రమంలో వీరసింహారెడ్డి మూవీ కూడా సాలిడ్ టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య చెల్లి పాత్రలో నటించింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.