Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తుండటంతో ‘వీరసింహారెడ్డి’ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
Veera Simha Reddy: వీరసింహారెడ్డి నుండి ‘మాస్ మొగుడు’గా వస్తున్న బాలయ్య!
కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించి చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. కొద్దిసేపటి క్రితమే ఆయన వీరసింహారెడ్డి ట్రైలర్‌ను చూశానని.. ఈ ట్రైలర్‌తో యూట్యూబ్‌లో రచ్చరచ్చ జరగనుందని థమన్ తెలిపారు. ఈ సినిమాకు పవర్ఫుల్ ట్రైలర్‌ను కట్ చేసినట్లుగా ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. బాలయ్యను చూస్తే అభిమానులు విజిల్స్ వేయకుండా ఉండలేరని.. ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్‌గా ఉండబోతుందని థమన్ అన్నారు.
Veera Simha Reddy: దుమ్ములేపుదాం.. థియేటర్ ఓనర్లు ప్రీపేర్ కావాలంటోన్న థమన్
బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా, ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను జనవరి 6న సాయంత్రం 6 గంటల నుంచి ఒంగోలులోని AMB కాలేజీ గ్రౌండ్స్‌లో వైభవంగా నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లోనే వీరసింహారెడ్డి ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Just saw #VeeraSimhaReddy trailer ??@YouTube
RACHHHHHHAAAAAA RACHHHHAAAAAAAA6 th JAN fire fire fire ? #JaiBalayya ??
— thaman S (@MusicThaman) January 3, 2023
Ongole, get ready to welcome the GOD OF MASSES ?#VeeraSimhaReddy Grand Pre Release Event on 6th Jan from 6 PM onwards ?
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/22XCS6MYLW
— Mythri Movie Makers (@MythriOfficial) January 3, 2023