Veera Simha Reddy: దుమ్ములేపుదాం.. థియేటర్ ఓనర్లు ప్రీపేర్ కావాలంటోన్న థమన్

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను చూసేందుకు వారు ఆతృతగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ షురూ చేయడంతో ఈ సినిమాపై వారిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ‘వీరసింహారెడ్డి’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

Veera Simha Reddy: దుమ్ములేపుదాం.. థియేటర్ ఓనర్లు ప్రీపేర్ కావాలంటోన్న థమన్

Thaman Tweet On Veera Simha Reddy BGM Goes Viral

Veera Simha Reddy: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను చూసేందుకు వారు ఆతృతగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ షురూ చేయడంతో ఈ సినిమాపై వారిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ‘వీరసింహారెడ్డి’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

Veera Simha Reddy: మేకింగ్ వీడియోతోనూ గూస్‌బంప్స్ తెప్పించిన వీరసింహారెడ్డి!

కాగా, ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. గతంలో బాలయ్యతో ‘అఖండ’కు బ్లాస్టింగ్ బీజీఎం అందించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు మరోసారి బాక్సులు బద్దలుకొట్టేందుకు రెడీ అయ్యాడు. వీరసింహారెడ్డి మూవీలోనూ థమన్ తనదైన బీజీఎంతో సౌండ్ బాక్సులకు ఎసరుపెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి థమన్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘‘థియేటర్స్‌లో కలుద్దాం.. దుమ్ములేపుదాం.. ఈసారి థియేటర్స్.. ప్లీజ్ డోంట్ కంప్లైన్.. ప్రిపేర్ అవ్వండి’’ అంటూ థమన్ ట్వీట్ చేశాడు.

Veera Simha Reddy: ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన వీరసింహారెడ్డి.. లాంచ్ అక్కడేనా..?

తాను ఈ సినిమాకు ఎలాంటి బీజీఎం ఇచ్చి ఉంటే, ఈ రేంజ్‌లో కాన్ఫిడెంట్‌గా ఉంటాడని అభిమానులు అంటున్నారు. ఇక థియేటర్లలో థమన్ బీజీఎంకు సౌండ్ బాక్సులు పగిలిపోవడం ఖాయమని వారు అంటున్నారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి థమన్ ట్వీట్‌లో పేర్కొన్నట్లుగా ఈ సినిమా బీజీఎంతో పూనకాలు తెప్పిస్తాడా లేడా అనేది చూడాలి.