Veera Simha Reddy: ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన వీరసింహారెడ్డి.. లాంచ్ అక్కడేనా..?

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ‘అఖండ’ తరువాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడం.. ‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో ‘వీరసింహారెడ్డి’పై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

Veera Simha Reddy: ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన వీరసింహారెడ్డి.. లాంచ్ అక్కడేనా..?

Veera Simha Reddy Trailer Launch Date And Venue Locked

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ‘అఖండ’ తరువాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడం.. ‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో ‘వీరసింహారెడ్డి’పై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

Veera Simha Reddy: సంక్రాంతి బరిలో రెండు తమిళ సినిమాలతో సమానంగా దిగుతున్న వీరసింహారెడ్డి!

అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో, ఈ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ‘వీరసింహారెడ్డి’ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 6న ఒంగోలులో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక మేకర్స్ ఈ ట్రైలర్ లాంచ్ కోసం భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Veera Simha Reddy : అభిమానుల ‘మనోభావాల్ని’ ఉత్సహపరుస్తున్న బాలయ్య.. సాంగ్ ప్రోమో రిలీజ్!

వీరసింహారెడ్డి ట్రైలర్‌ను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా కట్ చేసేందుకు గోపీచంద్ అండ్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో బాలయ్యతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి వీరసింహారెడ్డి ట్రైలర్‌ను నిజంగానే జనవరి 6న ఒంగోలులో రిలీజ్ చేయనున్నారా.. ఈ విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.