Veera Simha Reddy: సంక్రాంతి బరిలో రెండు తమిళ సినిమాలతో సమానంగా దిగుతున్న వీరసింహారెడ్డి!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది.

Veera Simha Reddy: సంక్రాంతి బరిలో రెండు తమిళ సినిమాలతో సమానంగా దిగుతున్న వీరసింహారెడ్డి!

Veera Simha Reddy Similar Runtime To Vaarisu And Thunivu

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహా రెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేసిన బాలయ్య..!

సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డితో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఒకరోజు ఆలస్యంగా జనవరి 13న రిలీజ్ కానుంది. కాగా, మరో రెండు తమిళ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్నాయి. తమిళ హీరో విజయ్ నటించిన ‘వారిసు’, అజిత్ నటించిన ‘తునివు’ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలతో సరిసమానంగా బాలయ్య ‘వీరసింహారెడ్డి’ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Varisu: వారసుడు హిందీ టైటిల్ ఏమిటో తెలుసా.. నెట్టింట వైరల్‌గా మారిందిగా!

తాజాగా ఈ మూడు సినిమాలకు సంబంధించిన రన్‌టైమ్‌ను పరిశీలిస్తే, ఈ విషయం అర్థమవుతోంది. ఈ మూడు సినిమాల నిడివి 2 గంటల 40 నిమిషాలుగా ఉండబోతుంది. ఒకేసారి రాబోతున్న మూడు సినిమాల నిడివి కూడా ఒకే విధంగా ఉండటంతో ప్రేక్షకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమా విజయాన్ని అందుకుంటుందో, ఏ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంటుందో తెలియాలంటే, పండగ వరకు ఆగాల్సిందే.

Runtime Of Veerasimha Reddy