వెండితెర దొరా లిరికల్ సాంగ్

ఎన్టీఆర్ కథానాయకుడులోని, వెండితెర దొరా, వినవా మొరా లిరికల్ సాంగ్ రిలీజ్.

  • Published By: sekhar ,Published On : January 7, 2019 / 10:54 AM IST
వెండితెర దొరా లిరికల్ సాంగ్

ఎన్టీఆర్ కథానాయకుడులోని, వెండితెర దొరా, వినవా మొరా లిరికల్ సాంగ్ రిలీజ్.

తన తండ్రి, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథతో, సినీ, రాజకీయాల నేపథ్యంలో, ఆయన తనయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు పార్ట్లుగా రూపొందుతుంది. ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్‌కి లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పటి వరకు బాలయ్య రకరకాల గెటప్స్‌లో ఉన్న పోస్టర్స్ రిలీజ్ చేసి, ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేసిన మూవీ యూనిట్, రీసెంట్‌గా ఎన్టీఆర్ కథానాయకుడులోని, వెండితెర దొరా, వినవా మొరా లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది.

ఆల్బమ్‌లో రెండవ సాంగ్ ఇది. దివిసీమ తుఫాను బాధితులు తమ గోడుని వెళ్లబోసుకునే సందర్భంలో ఈ పాట వస్తుంది. లిరికల్ వీడియోలో, దివిసీమ బాధితుల బాధలను, బాలయ్య అక్కడ వారిని పరామర్శిస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి, ఈ పాట రాసి, పాడడం విశేషం. బాలయ్య ప్రస్తుతం, ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటిస్తున్నాడు. జనవరి 8న యూ.ఎస్.లో భారీగా ప్రీమియర్ షోలు పడబోతుండగా, జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

వాచ్ లిరికల్ సాంగ్