Seethamma Vakitlo Sirimalle Chettu : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా..? పెద్దోడు – చిన్నోడు రెడీ..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మార్చ్ 7న రీ రిలీజ్ అవుతుంది.

Venkates Mahesh Babu Seethamma Vakitlo Sirimalle Chettu Re Release Trailer Released

Seethamma Vakitlo Sirimalle Chettu : వెంకటేష్ – మహేష్ బాబు హీరోలుగా 2013 లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. భారీ మల్టీస్టారర్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచింది. అప్పట్లోనే ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అయి, పాటలు హిట్ అయి థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేసింది. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది.

Also Read : Star Heros : రాబోయే సినిమాల్లో మేకోవర్ కోసం కష్టపడుతున్న స్టార్ హీరోలు..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మార్చ్ 7న రీ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే వెంకీమామ, మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాని థియేటర్స్ లో మరోసారి చూడటానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ చేయగా రీ రిలీజ్ లో కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు మంచి బుకింగ్స్ అవుతున్నాయి. తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

అయితే రీ రిలీజ్ ట్రైలర్ మొత్తం కథ అంతా చూపించేలా కట్ చేసారు. మీరు కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ ట్రైలర్ చూసేయండి..