Star Heros : రాబోయే సినిమాల్లో మేకోవర్ కోసం కష్టపడుతున్న స్టార్ హీరోలు..
కమిట్ అయిన సినిమాల్లో కొత్తగా కనిపించడానికి మేకోవర్ అవుతున్నారు స్టార్ హీరోలు.

Tollywood Star Heros Hard Work for Upcoming Movies Makeovers
Star Heros : అప్ కమింగ్ మూవీలకోసం తెగ కష్టపడుతున్నారు స్టార్ హీరోలు. కమిట్ అయిన సినిమాల్లో కొత్తగా కనిపించడానికి మేకోవర్ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాకోసం ఫుల్ గా మేకోవర్ అవుతున్నారు. దీనికోసం 10నుంచి 15కిలోల బరువు తగ్గారని టాక్ నడుస్తోంది. అసలు ఈ సినిమాకోసం ఎన్టీఆర్ ఇంతకు ముందెప్పుడూ లేనంత ట్రాన్స్ ఫామ్ అవుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ -ఎన్టీఆర్ మూవీ అసలు ఇండియన్ సినిమాలోనే ఇంతకుముందెప్పుడూ రాని సబ్జెక్ట్ తో అంత గ్రాండియర్ తో తెరకెక్కబోతోందని, వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని సినిమా మీదున్న అంచనాల్నిపెంచేశారు ప్రొడ్యూసర్లు.
ఇక మహేశ్ సంగతైతే చెప్పక్కర్లేదు ఏ ముహూర్తాన మహేశ్ రాజమౌళి తో సినిమా కమిట్ అయ్యారో అప్పటినుంచే మహేష్ మేకోవర్ పనిలో ఉన్నారు. తన హీరోల్ని నెక్ట్స్ లెవల్లో చూపించే రాజమౌళి మహేశ్ బాబుని కూడా ఇప్పటి వరకూ ఎప్పుడూ చూపించని కొత్తలుక్ లో చూపించబోతున్నారు. అందుకే లాంగ్ హెయిర్ తో పాటు ఫుల్ మస్క్యులర్ బాడీ రెడీ చేస్తున్నారు మహేశ్. దాదాపు సంవత్సరం నుంచే రాజమౌళి సినిమాకి కావల్సినట్టు మేకోవర్ అవుతున్న మహేశ్ ఇంకా అదే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు.
Also Read : Emoji : ‘ఎమోజీ’ మూవీ రివ్యూ.. లవ్ బ్రేకప్ అయిన ఇద్దరు పెళ్లి చేసుకొని..
ట్రాన్స్ ఫర్మేషన్ అంటే ప్రభాస్ దే. ఒక్కో సినిమాకి ఒక్కో రకంగా కనిపిస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తున్నారు ప్రభాస్. సలార్ లో బల్క్ బాడీ తో ఉన్న ప్రభాస్ కల్కి లో కాస్త స్లిమ్ అయ్యారు. రాజాసాబ్ కోసం అదే లీన్ బాడీ మెయింటెన్ చేసిన ప్రభాస్ ఇప్పుడు సందీప్ రెడ్డి తో చేస్తున్న స్పిరిట్ కోసం సాలిడ్ పోలీస్ ఆఫీసర్ గా మేకోవర్ అయ్యే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాడీ వైజే కాకుండా క్యారెక్టర్ వైజ్ కూడా ఎప్పుడూ చెయ్యనటువంటి కొత్త రోల్ కోసం కష్టపడుతున్నారు.
Also Read : Manchu Manoj : మంచు ఫ్యామిలీలో వివాదాల వేళ.. భార్య గురించి మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..
పుష్ప 2 లోనే ఫుల్ హెయిర్, గడ్డంతో డ్రాస్టిక్ మేకోవర్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ తో చెయ్యబోయే సినిమాలో ఇంకా కొత్తగా కనిపించడం కోసం మేకోవర్ అవుతున్నారు. అందుకే అసలు బన్నీ ఎక్కువగా బయటికి రావడం లేదని, లుక్ రివీల్ చెయ్యకుండా జాగ్రత్తపడుతున్నారని, ఆ మేకోవర్ కోసం టైమ్ పడుతుందని కూడా తెలుస్తోంది. మరి కార్తికేయుడిగా బన్నీ ఎలా ఉంటాడో ఎలాంటి మేకోవర్ చేస్తున్నారో అన్నది లుక్ రివీల్ అయితే తప్ప తెలీదు. ఇలా వరసగా స్టార్ హీరోలందరూ కొత్త సినిమాల కోసం క్రేజీ మేకోవర్ అవుతూ సినిమాల మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు.