Venkatesh : 26 ఏళ్ళ క్రితం వచ్చిన తన సూపర్ హిట్ సాంగ్‌కి.. డ్యాన్స్ వేసిన వెంకటేష్..
'జిగర్తాండ డబల్ ఎక్స్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాఘవ లారెన్స్, వెంకటేష్ కలిసి ప్రేమించుకుందాం రా సినిమాలోని 'పెళ్లి కల వచ్చేసింది బాల..' అంటూ సాగే పాటకు స్టెప్పులు వేశారు.

Venkatesh Danced for his super hit Song in Jigarthanda Double X Pre Release Event
Venkatesh : హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా ‘జిగర్తాండ డబల్ ఎక్స్’(Jigarthanda Double X)తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraj) దర్శకత్వంలో రాఘవ లారెన్స్(Raghava Lawrence), SJ సూర్య మెయిన్ లీడ్స్ లో గతంలో వచ్చిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్ దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో నిన్న రాత్రి నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు వెంకటేష్ గెస్ట్ గా వచ్చారు.
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాఘవ లారెన్స్, వెంకటేష్ కలిసి ప్రేమించుకుందాం రా సినిమాలోని ‘పెళ్లి కల వచ్చేసింది బాల..’ అంటూ సాగే పాటకు స్టెప్పులు వేశారు. వెంకటేష్ ఈవెంట్ కి రాగా ఈ పాట ప్లే చేశారు. దీంతో అప్పట్లో ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేసిన లారెన్స్ డ్యాన్స్ వేస్తూ వెంకటేష్ ని కూడా వేయమనడంతో వెంకీ మామ కూడా లారెన్స్ తో కలిసి ఆ సిగ్నేచర్ స్టెప్ వేశారు.
Also Read : Japan Movie Pre Release event : జపాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
దీంతో 26 ఏళ్ళ క్రితం వచ్చిన వెంకటేష్ సినిమా ప్రేమించుకుందాం రా లోని పెళ్లికళ వచ్చేసింది బాల.. సిగ్నేచర్ స్టెప్ వేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వెంకీ అభిమానులు ఈ వీడియో చూసి తెగ ఆనందపడిపోతున్నారు.
#Venkatesh and #RaghavaLawrence danced to the iconic 'Pelli Kala Vachesinde' song at the #JigarthandaDoubleX Pre-Release Event. pic.twitter.com/Efzs1rNTRk
— Gulte (@GulteOfficial) November 4, 2023
Our Ever Energetic #Venkatesh dance with #raghavalawrence at #jigarthandadoublex event in #hyderabad #victorvenkatesh #lawrence @offl_Lawrence @VenkyMama pic.twitter.com/hqXUIDYFhp
— నేను మీ తెలుగు అమ్మాయి (@Me_TeluguAmmayi) November 4, 2023