NTR – Venkatesh : వెంకటేష్ ఫ్యామిలీతో ఎన్టీఆర్ ఫ్యామిలీ బంధుత్వం.. యువ హీరో నిశ్చితార్థంలో వెంకటేష్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందడి..

దగ్గుబాటి కుటుంబంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ బంధుత్వం కలుపుకుంటుంది.

Venkatesh Family and NTR Family going to Relatives with Narne Nithiin Marriage

NTR – Venkatesh : మ్యాడ్, ఆయ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు నార్నె నితిన్. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి సోదరుడు ఇతను. ఎన్టీఆర్ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి పరిచయమైనా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వరుస హిట్స్ కొట్టిన ఈ హీరో త్వరలో మ్యాడ్ 2 సినిమాతో వచ్చి హ్యాట్రిక్ హిట్ కొడుతున్నాడు. తాజాగా నార్నె నితిన్ నిశ్చితార్థం చేసుకున్నాడు.

Also Read : Narne Nithiin – NTR : నిశ్చితార్థం చేసుకున్న హీరో.. బామ్మర్ది నిశ్చితార్థానికి ఫ్యామిలీతో వచ్చిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..

హీరో దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి బంధువులు అయిన తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప కూతురు అయిన శివాని తాళ్లూరిని ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ కు ఇచ్చి పెళ్లి చేయనున్నారు. తాజాగా నేడు నార్నె నితిన్ – శివాని నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అలా దగ్గుబాటి కుటుంబంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ బంధుత్వం కలుపుకుంటుంది.

ఈ నిశ్చితార్థం వేడుకకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్యామిలీలతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీలు కూడా హాజరయ్యాయి. పలు ఫోటోలు, వీడియోలు ఈ నిశ్చితార్థం నుంచి లీక్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వెంకటేష్ ఉన్న ఫోటో వైరల్ గా మారింది. ఈ నిశ్చితార్థం నుంచి ఈ హీరోలు కలిసి ఉన్న మరిన్ని ఫోటోలు వస్తాయని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక కాబోయే కొత్త జంటకు ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.