Venkatesh : స్టూడెంట్స్‌తో వెంకీ మామ రచ్చ రంబోలా.. వీడియో చూశారా.. జస్ట్ లూకింగ్ లైక్ ఏ వావ్..
‘సైంధవ్’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో స్టూడెంట్స్‌తో కలిసి వెంకీ మామ రచ్చ రంబోలా చేశారు.

Venkatesh funny moments with students at Saindhav song launch event
Venkatesh : సినిమాల్లో విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నాళ్ళ అయినా ఆయన సినిమాల్లో కామెడీ మాత్రం ఎవర్ గ్రీన్ ఉంటుంది. ఇక ఆన్ స్క్రీన్ పై తన కామెడీ టైమింగ్ తో ఎలా ఎంటర్టైన్ చేస్తారో.. ఆఫ్ స్క్రీన్ లో కూడా అంతే సరదాగా ఉంటూ చుట్టూ ఉన్నవారి పెదాల పై నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా వెంకీ మామ కాలేజీ స్టూడెంట్స్ తో కలిసి రచ్చ రంబోలా చేశారు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న డైలాగ్స్ చెబుతూ, ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ గురించి మాట్లాడుతూ సందడి చేశారు.
వెంకటేష్ నటిస్తున్న ‘సైంధవ్’ మూవీ నుంచి నేడు మొదటి సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సాంగ్ లాంచ్ కాలేజీ స్టూడెంట్స్ మధ్య రిలీజ్ చేయడానికి రెండు ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్స్ లో వెంకీ మామ పాల్గొని స్టూడెంట్స్ లో తాను ఒక కుర్రాడిలా మారిపోయి అల్లరి చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుక్ లైక్ ఏ వావ్” అనే డైలాగ్ ని స్టేజి మీద చెప్పి సందడి చేశారు. అలాగే ఇటీవల ప్రపంచ కప్ ఓడిపోయిన భారత్ జట్టుకి ధైర్యం చెబుతూ స్టూడెంట్స్ చేత వారికీ చప్పట్లు ద్వారా అభినందనలు తెలియజేయించారు.
Also read : Hi Nanna – Kannappa : ‘హాయ్ నాన్న’ ట్రైలర్ రిలీజ్ డేట్.. ‘కన్నప్ప’ బర్త్ డే అప్డేట్.. ప్రభాస్ పోస్టర్..!
అ టైమింగ్ ని ఎవరైనా వాడుకోండిరా అయ్యా@VenkyMama #Venkatesh #Saindhav
pic.twitter.com/S0tXahPVZZ— Asuran (@asuran243) November 21, 2023
అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చిన టీం ఇండియా ఓడిపోయింది ఒక మ్యాచ్ మాత్రమే. ఆ మ్యాచ్ దాని స్థానం ఏమి తగ్గిపోదు. రోహిత్, విరాట్, రాహుల్, సిరాజ్.. ఇలా ప్రతి ప్లేయర్ ని చూసి మేము గర్వపడుతున్నామంటూ తెలియజేశారు. ఇక తన సినిమా ప్రమోషన్స్ లో కూడా వెంకటేష్ క్రికెట్ గురించి మాట్లాడడంతో పలువురు నెటిజెన్స్.. వెంకీ మామ గురించి తెలిసిందేగా మనలాగానే క్రికెట్ పిచ్చొడు అంటూ మీమ్స్ చేస్తున్నారు. అలాగే ఈ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని వీడియో ప్రతుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Venky Mama ???#Saindhav pic.twitter.com/NI6Ewv6Usx
— Meme Raja (@Meme_Raaja) November 21, 2023
#RanaNaidu – Season 2 Soon. I have taken feedback, it will be in limits with a little mischief.
– #Venkatesh at #Saindhav event. pic.twitter.com/aO74Pv0PC5
— Gulte (@GulteOfficial) November 21, 2023
అందుకే నేను నచ్చానా… అయ్యబాబోయ్ బాబోయ్ ..#Venkatesh #Saindhav pic.twitter.com/6P6x6XioU5
— Gulte (@GulteOfficial) November 21, 2023
View this post on Instagram