Venkatesh Maha Deleted his Twitter account Due to Salaar Fans Trolls
Venkatesh Maha : కేరఫా కంచరపాలెం(C/o Kancherapalem) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వెంకటేష్ మహా ఆ తర్వాత ఇంకో సినిమా చేసి ప్రస్తుతం నటుడిగా పలు సినిమాలు చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో KGF సినిమాని బాగా విమర్శించి వివాదంలో నిలిచాడు వెంకటేష్ మహా. KGF సినిమాపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటంతో ఆ సినిమా అభిమానులు, నెటిజన్లు ఈ డైరెక్టర్ పై ఫైర్ అయ్యారు. అయితే ఆ తర్వాత సారీ చెప్పినా తన అభిప్రాయం మార్చుకోనని అన్నాడు.
అప్పట్నుంచి సోషల్ మీడియాలో తీసిన ఒక్క సినిమాకే ఇంకో సినిమాని తిట్టేంతగా మాట్లాడుతున్నాడు అంటూ ఎప్పుడు దొరికితే అప్పుడు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల మరోసారి తనని ట్రోల్ చేసే వారిపై సీరియస్ గా ఫైర్ అయి లీగల్ గా వెళ్తాను అనడంతో మరోసారి నెటిజన్లు ఈ డైరెక్టర్ పై విమర్శలు చేశారు. తాజాగా మరోసారి వెంకటేష్ మహా వివాదంలో నిలిచాడు.
ఇండియా అంతా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సలార్ సినిమా ఊపు కనిపిస్తుంటే, ప్రేక్షకులు అంతా సలార్ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటే వెంకటేష్ మహా.. నా ఫేవరేట్ షారుఖ్ ఖాన్ ని రాజ్ కుమార్ హిరాణి గారి సినిమాలో చూడటానికి నేను రెడీ. ఫస్ట్ డేనే టికెట్ బుక్ చేసుకున్నాను. సెన్సార్ బోర్డు వాళ్ళు సినిమా చూసి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని విన్నాను. అదే కనక నిజమైతే ఈ సినిమా ఎమోషన్స్ తో ఫిలిం లవర్స్ ని మెప్పిస్తుంది అని ట్వీట్ చేశాడు.
Also Read : Hanuman Trailer : తేజ సజ్జ హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది.. హనుమంతుడి ఆగమనం అదిరిపోయిందిగా..
అయితే ఈ ట్వీట్ నిన్న సలార్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక పెట్టడం, గతంలో KGF ని హేట్ చేసినట్టే ఇప్పుడు ఇండైరెక్ట్ గా సలార్ ని హేట్ చేస్తున్నాడని, కావాలని అభిమానులని ట్రిగ్గర్ చేస్తున్నాడని ప్రశాంత్ నీల్, ప్రభాస్ అభిమానులు వెంకటేష్ మహా పై ఫైర్ అయ్యారు. అందరూ కలిసి వెంకటేష్ మహా అకౌంట్ ని రిపోర్ట్ కొట్టడం, అతన్ని ట్రోల్ చేయడం చేశారు. దీంతో దెబ్బకి వెంకటేష్ మహా తన ట్విటర్ అకౌంట్ ని డీ యాక్టివేట్ చేశాడు. అయితే ఇటీవలే ఇలాంటి ట్రోలింగ్ కి గట్టిగా సమాధానం ఇస్తాను, లీగల్ గా కూడా వెళ్తాను అని వెంకటేష్ మహా చెప్పి ఇప్పుడేమో ఏకంగా ట్విట్టర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. మరి వెంకటేష్ మహా దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
After Rama Jogaiah Sastri, we have another film celebrity deactivating account due to criticism by fans. Director Venkatesh Maha did it after posting the below message right after #Salaar release trailer got released! pic.twitter.com/0OpnNDg007
— idlebrain.com (@idlebraindotcom) December 18, 2023