Seethamma Vakitlo Sirimalle Chettu : సూపర్ హిట్ మల్టీస్టారర్.. క్లాసిక్ సినిమా.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్.. ఎప్పుడో తెలుసా?
ఇప్పటికే బోలెడన్ని సూపర్ హిట్ పాత సినిమాలు రీ రిలీజ్ అవ్వగా ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కానుంది.

Venkatesh Mahesh Babu Seethamma Vakitlo Sirimalle Chettu Movie Re Releasing Details Here
Seethamma Vakitlo Sirimalle Chettu : ఇటీవల అనేక పాత సినిమాలు, హిట్ సినిమాలు, క్లాసిక్ గా మిగిలిన సినిమాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులకు ఆనందాన్నిస్తున్నాయి. సినిమా లవర్స్ ఒకప్పటి మంచి సినిమాలను మరోసారి థియటర్స్ లో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా హీరోల ఫ్యాన్స్ కూడా తమ హీరో సినిమా రీ రిలీజ్ చేస్తే థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.
Also Read : Chiranjeevi : తల్లి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి.. అలా ప్రచారం చెయ్యొద్దు..
ఇప్పటికే బోలెడన్ని సూపర్ హిట్ పాత సినిమాలు రీ రిలీజ్ అవ్వగా ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కానుంది. వెంకటేష్ – మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన సూపర్ హిట్, క్లాసిక్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని మార్చ్ 7న రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్, వెంకటేష్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ విలువలు, మనుషుల మధ్య బంధాలు, ప్రేమానురాగాలు, జీవిత సత్యాలు.. లాంటి కాన్సెప్ట్ తో గోదావరి జిల్లాల్లో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అందర్నీ మెప్పించింది. ఈ సినిమాలోని పాటలు కూడా బాగుంటాయి. మరోసారి ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలనుకుంటే మార్చ్ 7న రీ రిలీజ్ కి వెళ్లాల్సిందే.
Also Read : Aanand Vardhan : ఆ రోజు నా మాటలకు చిరంజీవి ఏడ్చేశారు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్.. ఇప్పుడు హీరోగా..