RanaNaidu: బాబాయ్-అబ్బాయ్ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న లుక్!
తెలుగు సినిమాలో ఇప్పుడు మల్టీస్టారర్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా అనంతరం వెబ్ సిరీస్ లకు భారీ డిమాండ్ నెలకొంది.

Rananaidu
RanaNaidu: తెలుగు సినిమాలో ఇప్పుడు మల్టీస్టారర్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా అనంతరం వెబ్ సిరీస్ లకు భారీ డిమాండ్ నెలకొంది. మార్కెట్ అవసరాలను బట్టి అవకాశాలను వెతుక్కునే దగ్గుబాటి ఫ్యామిలీ ఇప్పుడు భారీ మల్టీస్టారర్ వెబ్ సిరీస్ కు సిద్ధమైంది. కృష్ణం వందే జగద్గురం సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో వెంకటేష్, రానా కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. మళ్ళీ వీరిద్దరూ కలిసి ఫుల్ లెన్త్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. నిజానికి చాలా కాలంగా వీరిద్దరి కాంబోలో ఒక మల్టీ స్టారర్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Prabhas: పక్కా ప్లాన్.. ఒకేసారి 4 సినిమాలు లైన్లో పెట్టిన యూనివర్సల్ స్టార్!
మూవీ మొఘల్ రామానాయుడు సైతం వారి కుటుంబంలోని బాబాయి అబ్బాయి కాంబోలో ఒక సినిమా చూడాలని భావిస్తున్నట్లు గతంలో చెప్పుకొచ్చారు. అభిమానులు కూడా ఈ కాంబినేషన్ సెట్టైతే చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరందరికీ గుడ్ న్యూస్ చెప్పింది నెట్‌ఫ్లిక్స్. ఓటీటీ కోసం వెంకీ, రానా కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించారు. దీనికి `రానా నాయుడు` అనే టైటిల్ ఖరారు చేయగా.. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకులు. అమెరికన్ క్రైమ్ డ్రామా రాయ్ దొనోవన్ స్ఫూర్తితో ఈ సిరీస్ ని తెరకెక్కించారు.
Exchange of Fire : ఏవోబీలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు
ఈ థ్రిల్లర్‌లో వెంకీ గెటప్ కొత్తగా ఉండబోతుండగా.. ఈ వెబ్ సిరీస్‌లో ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి? ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? అనే విషయాల్ని నెట్ ఫ్లిక్స్ త్వరలోనే వెల్లడి చేయబోతోంది. ఈ సీజన్ హిట్టయితే… తదుపరి సీజన్ల కోసం కూడా స్క్రిప్టు రెడీగా ఉండగా.. అన్ని దక్షిణాది భాషల్లోనూ ఈ సిరీస్ ని డబ్ చేసి స్ట్రీమ్ చేయనున్నారు. తెలుగు అగ్రహీరోలలో ఒకడైన సీనియర్ హీరో వెంకీ.. ఇప్పటికే ఇండియాలోని అన్ని బాషలలో నటుడిగా గుర్తింపు పొందిన రానా కలిసి చేయనున్న ఈ సిరీస్ సక్సెస్ కొడితే నెట్ ఫ్లిక్స్ మరిన్ని సిరీస్ లకు ప్లాన్ చేయనున్నట్లుగా తెలుస్తుంది.
?THIS IS NOT A DRILL!?
Rana Daggubati and Venkatesh are in a Netflix show together!!#RanaNaidu, coming soon on Netflix.@RanaDaggubati @VenkyMama @krnx @Suparn @IncLocomotive @ViaCBSGlobalDst pic.twitter.com/w8aQpenmUx— Netflix India (@NetflixIndia) September 22, 2021