Venkatesh Saindhav Movie Second Schedule Starts
Saindhav: విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరికొత్త పాత్రలో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ తెలపడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.
Saindhav Movie: కీలక షెడ్యూల్‌ను ముగించుకున్న వెంకీ సైంధవ్ మూవీ
కాగా ఇప్పటికే షూటింగ్ పనులు మొదలుపెట్టుకున్న ఈ సినిమా, తొలి షెడ్యూల్‌ను లెంగ్తీగా జరుపుకుంది. ఈ షెడ్యూల్‌లో పలు ఆసక్తికర సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రెండో షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేశారు. ఈ మేరకు ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చిత్ర యూనిట్ చేసింది.
Saindhav : సైంధవ్ అప్డేట్.. రాంపేజ్ అంటున్న వెంకటేష్!
ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ను వైజాగ్‌లో నిర్వహిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. వెంకటేష్‌తో పాటు పలువురు నటీనటులు ఈ రెండో షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. మరి ఈ సినిమా షూటింగ్‌ను ఎప్పుడు ముగిస్తారా.. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
After the successful 1st Schedule in Hyderabad?
Team #SAINDHAV kick starts the SECOND SCHEDULE in VIZAG Today with great energy ?
Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/OkoFt4rTu3
— Vamsi Kaka (@vamsikaka) April 13, 2023