Site icon 10TV Telugu

Sankranthiki Vasthunam : ఓవర్సీస్‌లో అద‌ర‌గొడుతున్న ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’..

Venkatesh Sankranthiki Vasthunam first day collections in North america

Venkatesh Sankranthiki Vasthunam first day collections in North america

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన చిత్రం సంక్రాంతికి వ‌స్తున్నాం. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా నిన్న (జ‌న‌వ‌రి 14న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవ‌ర్సీస్‌లోనూ ఈ చిత్రం రిలీజైంది. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌కు ఆడియ‌న్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఓవ‌ర్సీస్‌లో ఈ చిత్రం తొలి రోజు 7ల‌క్ష‌ల డాల‌ర్లు రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలిపింది.

కాగా.. వెంక‌టేష్ కెరీర్‌లోనే తొలి రోజు ఓవ‌ర్సీస్‌లో ఈ స్థాయి క‌లెక్ష‌న్లు రావ‌డం ఇదే తొలిసారి అని తెలిపింది. దీంతో వెంకీ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం వ‌న్ మిలియ‌న్ క్ల‌బ్‌లో చేర‌డం ఖాయం అని కామెంట్లు పెడుతున్నారు.

Tollywood directors : ఒకే దారిలో ఆ ముగ్గురు డైరెక్టర్లు.. ఇలా ఉంటే కష్టమే..!

ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. ఈ చిత్రం అంద‌రిని క‌డుపుబ్బా న‌వ్వించి మెప్పించింది. బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చినందుకు ప్రేక్ష‌కుల‌కు చిత్ర బృందం కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.

Abhimani Movie : సురేష్ కొండేటి ‘అభిమాని’ సినిమా కోసం మణిశర్మ..

‘మా చిత్రాన్ని ఆద‌రించిన అభిమానులు, ప్రేక్ష‌కుల‌కు మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ప్రేక్ష‌కుల ముఖంలో ఆనందం చూస్తుండ‌డం ఓ ఎమోష‌న్‌. పండ‌గ‌కు మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఇవ్వాల‌నే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును మొద‌లు పెట్టాం. మేం అనుకున్న‌ట్లుగానే మీరు విజ‌యాన్ని అందించారు.’ అని వెంక‌టేష్ అన్నారు.

Exit mobile version