Abhimani Movie : సురేష్ కొండేటి ‘అభిమాని’ సినిమా కోసం మణిశర్మ..
సీనియర్ జర్నలిస్ట్, నటుడు సురేష్ కొండేటి మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా 'అభిమాని'.

Manisharma Giving Background Music to Suresh Kondeti Abhimani Movie
Abhimani Movie : సీనియర్ జర్నలిస్ట్, నటుడు సురేష్ కొండేటి మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అభిమాని’. SK రెహమాన్, కంద సాంబశివరావు నిర్మాణంలో రాంబాబు దోమకొండ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో అజయ్ ఘోష్, అక్సా ఖాన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.
Also Read : Sunny Leone : తెలుగు సినిమా ‘త్రిముఖ’లో సన్నీ లియోన్.. పోస్టర్ రిలీజ్..
అయితే ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. నేడు సంక్రాంతి సందర్భంగా సురేష్ కొండేటి మణిశర్మను కలిశారు. ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ.. మంచి కంటెంట్, సోషల్ మెసేజ్ ఉన్న అభిమాని సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరింది. ఈ సినిమాలో ఉన్న పాయింట్ అందరికి కనెక్ట్ అవుతుంది. సురేష్ కొండేటి బాగా నటించారు. సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుండి నాకు పరిచయం ఉన్నాడు. ఈ సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంటాడు అని తెలిపారు.
డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ.. అభిమాని సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెలొడీ బ్రహ్మ మణిశర్మ గారు అందించడం ఆనందకరమైన విషయం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. రీ రికార్డింగ్ అయిపోయింది. సినిమా చివరి 20 నిమిషాలకు మణిశర్మ గారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశారు. ఈ సినిమాలో సురేష్ కొండేటి గారు ముఖ్య పాత్రలో యముడిగా అజయ్ ఘోష్, నానమ్మ పాత్రలో అన్నపూర్ణమ్మ గారు, చిత్రగుప్తుని పాత్రలో ఎస్.కె రెహమాన్, హీరోయిన్‌గా అక్సాఖాన్, హీరోగా జై క్రిష్ నటించారు అని తెలిపారు.
Also Read : Jailer 2 : రజినీకాంత్ జైలర్ 2 టీజర్ వచ్చేసింది.. ఎలివేషన్స్ అదిరిపోయాయిగా..
సురేష్ కొండేటి మాట్లాడుతూ.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు నేను ముఖ్య పాత్ర పోషించిన అభిమాని సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం నా జీవితంలో మర్చిపోలేను. తెలుగులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే మణిశర్మ చేయాలనే రేంజ్‌లో తన సినిమాలతో రఫ్పాడించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు అదిరిపోయే సంగీతం ఇచ్చి హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. నేను యంగ్ గా ఉన్నప్పుడు ఆయన పాటలు వింటూ పెరిగాను. ఇప్పుడు ఆయన నా సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం సంతోషంగా ఉంది. నన్ను సినీ జర్నలిస్ట్ గా, నిర్మాతగా ఆదరించిన ప్రేక్షకులు నటుడిగా కూడా అభిమాని సినిమాతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.